డాడీ ఎవరినీ విడిచిపెట్టొద్దు.. లవ్ యు-నటుడు విజయ్ సెల్ఫీ వీడియో

First Published 11, Dec 2017, 6:26 PM IST
actor vijay sai recorded selfie video before suicide
Highlights
  • ఆత్మ హత్య చేసుకున్న సినీనటుడు విజయ్
  • ఆత్మహత్యకు ముందు  సెల్ఫీ వీడియో రికార్డు చేసిన విజయ్
  • తన చావుకు భార్యతో పాటు మరో ఇద్దరు కారణమని వీడియో రికార్డు

సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు విజయ్ సాయి ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలో విజయ్ సాయి పలు సంచలన విషయాలు చెప్పినట్లు సమాచారం. తాను ఎందుకు చనిపోతున్నానో కారణం తెలుపుతూ వీడియో రికార్డు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆ వీడియో పోలీసులు రిలీజ్ చేస్తారో లేదో కానీ... దాంట్లో సంచలన విషయాలున్నట్లు చెప్తున్నారు.

 

ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్పీ వీడియోలో... తన భార్యతో పాటు మరో ఇద్దరు తనను వేధింపులకు గురి చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వివరించినట్లు సమాచారం. మూడు సంవత్సరాల నుండి భార్యతో గొడవలు ఉండటం వల్ల విడిగా ఉంటున్నానని, తాను యూసఫ్ గూడలో, ఆమె మణికొండలో ఉంటున్నట్లు విజయ్ సాయి ఆ వీడియోలో వెల్లడించినట్లు సమాచారం.

 

విడాకులు కావాలని తన భార్య కేసు వేసిందని, దీంతో పాటు భరణం డిమాండ్ చేస్తూ మరో కేసు వేసిందని సెల్ఫీ వీడియోలో విజయ్ సాయి చెప్పినట్లు టీవీ చానల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈ రెండు కేసులు విత్ డ్రా చేసుకోవడానికి తన భార్య రూ. 3 కోట్లు ఇవ్వాలని మధ్యవర్తి ద్వారా వ్యవహారం నడిపినట్లు.. విజయ్ సాయి సెల్ఫీ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.

 

భార్యకు, తనకు మధ్య జరుగుతున్న వివాదంలో శశిధర్ అనే వ్యక్తి జోక్యం కూడా ఎక్కువైందని, అతడితో పాటు అడ్వకేట్ కూడా తమను వేధింపులకు గురి చేశాడని విజయ్ సాయి సెల్పీ వీడియోలో వెల్లడించినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా మూడు రోజుల క్రితం తన ఇంటికి వచ్చి వస్తువులు తీసుకెళ్లడంతో పాటు కారు కూడా తీసుకెళ్లడంతో తాను మరింత వేధనకు గురయ్యానని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు విజయ్ సాయి తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

loader