జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తున్న భారత నిఘా సంస్థలు వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇకపోతే నేడు ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో మరణించగా అందులో ఒకరు సినీ నటుడని పోలీసులు గుర్తించారు. ఇక మరొక ఉగ్రవాది 14 ఏళ్ల బాలుడు కావడం అందరిని ఆశ్చర్యపరచింది. 

బాండీపొరాలోని సోపోర్‌లో ఉగ్రవాదులు ఆనవాళ్లు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో రంగంలోకి దిగిన రక్షణదళాలు బుధవారం రాత్రి నుంచే వారున్న చోట్లపై పట్టు బిగించాయి. ఉదయం వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.మరణించిన 17 ఏళ్ల షకీబ్ బిలాల్ అహ్మద్ 2014 రిలీజైన బాలీవుడ్ హైదర్ సినిమాలో నటించాడు. 

ఆ సినిమాలో షాహిద్ కపూర్ చిన్నప్పటి పాత్రలో ఈ యువకుడు బాలనటుడిగా నటించాడు. ఈ ఏడాది ఆగష్టు నుంచి కనిపించకుండా పోయిన ఈ యువకుడు  లష్కరే తాయిబా ఉగ్రవాదని పోలీసులు గుర్తించారు. మరో బాల ఉగ్రవాది 14 ఏళ్ల ముదసిర్ అహ్మద్ కూడా హతమయ్యాడు. ఈ బాలుడు కూడా అదే ఆగస్టు నెలలో కనిపించకుండా పోయినట్లు రక్షణదళాలు తెలియజేశాయి.