Asianet News TeluguAsianet News Telugu

మహిళా జర్నలిస్ట్ లపై నోరు జారిన నటుడు, షాక్ ఇచ్చిన కోర్ట్..

నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. సామాన్యులైనా.. ? సెలబ్రిటీలైనా...? ఎవరికైనా శిక్ష తప్పదు అని నిరూపణ అయ్యింది. తాజాగా  మహిళలపై నీచంగా మాట్లాడిన ఓనటుడికి శిక్షపడింది. ఇంతకీ అసలు సంగతేంటంటే..? 

Actor Sv Sekar Is Sentenced And 15 Thousand Penalty By Special Court In Female Journalist Case JMS
Author
First Published Feb 20, 2024, 4:17 PM IST


తమిళంలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్ వి శేఖర్. నోరుందికదా అని ఆయన ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు మహిళలమీద. అందులోను జర్నలిస్ట్ లమీద నోరు పారేసుకున్నారు. అందుకు ఫలితం కూడా తాజాగా అనుభవించాడు.  ప్రముఖ తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఎస్‌.వి.శేఖర్‌కు మహిళా జర్నలిస్టును ఉద్దేశించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకు ఆయనకు నెల రోజుల జైలుశిక్ష,15 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు  సోమవారం తీర్పు చెప్పింది. 

అసలు విషయం ఏంటంటే.. 2018లో ఎస్‌.వి.శేఖర్‌ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టు వివాదాస్పదమయ్యింది. ఆయన చేసిన కామెంట్లు చాలా మందిని బాధించాయి. మరీ ముఖ్యంగా మహిళా జర్నలిస్టు లను ఆయన అన్న మాటలు రాష్ట్రవ్యాప్తంగా అగ్గిరాజేశాయి. 
మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఆయన వల్గర్ కామెంట్లు చేశారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానిస్తూ ఓ పోస్ట్‌ పెట్టాడు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. 

ఈ విషయంలో మీడియా భగ్గుమన్నది. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో తేలింది. ఈ విషయంలో చాలా మంది కోర్టుకెక్కారు. వివాదం పెద్దది అవుతుండగా.. ఎస్‌.వి.శేఖర్‌ వెంటనే  సారీ కూడా చెప్పారు.  కాని ఆయన చేసిన కామెంట్ల ప్రభావం ఆయన్ను వదిలిపెట్టలేదు. ఆ కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఇక ఈ కేసు నుంచి బయట పడటానికి దర్శఖుడు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును కూడా శేఖర్‌ ఆశ్రయించారు. కాని కోర్టు ఈ అభ్యర్ధనను నికారకరించింది. అది కుదరదని.. తప్పకుండా విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ హైకోర్టు తెలిపింది. 

అయితే  ఈ కేసుకుసబంధించిన వాదనలు.. వాయిదాలుఅన్నీ చైన్నె కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన  ప్రత్యేక కోర్టులో జరిగాయి. అప్పటి నుంచి  న్యాయమూర్తి జయవేల్‌ ఈ కేసును విచారిస్తూ వచ్చారు. వాదనలు ముగియడంతో సోమవారం తీర్పు చెప్పారు. ఎస్‌.వి.శేఖర్‌కు నెల రోజులు జైలు శిక్షతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధించారు. అప్పీల్‌కు అవకాశం కల్పించాలని శేఖర్‌ తరపున న్యాయవాదులు జడ్జీకి విన్నవించుకున్నారు. ఇందుకు అవకాశం కల్పిస్తూ తాత్కాలికంగా శిక్షను నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పీల్‌ కోసం మూడు వారాలు గడువు కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios