స్టార్ హీరో సుదీప్ కారు ప్రమాదంలో గాయ పడ్డారని కన్నడ వర్గాల ద్వారా తెలుస్తోంది. కన్నడలో స్టార్ హీరో అయిన సుదీప్ తెలుగులో కూడా నటించాడు. రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సినిమాలో విలన్ పాత్రలో నటించి తెలుగు వారికి దగ్గరయ్యాడు.

ప్రస్తుతం ఆయన కన్నడలో నటిస్తోన్న 'పైల్వాన్' సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా సుదీప్ నటించిన 'ది విలన్' సినిమా టీజర్ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. దీనికి సుదీప్ రాకపోవడంపై మీడియాలో చర్చ మొదలైంది.

ఆ కార్యక్రమానికి తాను ఎందుకు హాజరు కాలేకపోయాననే విషయాన్ని వెల్లడిస్తూ.. కారు ప్రమాదంలో గాయపడ్డ కారణంగా హాజరుకాలేకపోయినట్లు చెప్పారు. అభిమానులంతా అయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.