తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై ఒక్కొక్కరుగా బాధిత హిరోయిన్లు, అవకాశాలు రాక మోసపోయిన వర్థమాన హిరోయిన్లు గొంతెత్తుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మీటూ హ్యాష్ ట్యాగ్ తో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలువురు హిరోయిన్లు సోషల్ మీడియాలో స్పందిస్తన్న సంగతి తెలిసిందే.

 

తాజాగా తెలుగులో అలా మోసపోయిన వర్థమాన నటి శ్రీ రెడ్డి గత కొన్ని రోజులుగా బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనను మోసం చేసిన కొందరి గురించి మాట్లాడిన శ్రీ రెడ్డి.. అకాశాలు ఇవ్వకుండా కో ఆర్డినేటర్లు వాడుకుని ఎలా వదిలేస్తారో వివరించింది. తనను మోసం చేసిన  కో ఆర్డినేటర్ చాంద్ ఖాన్ బండారం బట్టబయలు చేసింది.

 

మరోవైపు తమని వాడుకోవటమే కాకుండా.. వాళ్ల వాళ్ల పనులు నెరవేర్చుకునేందుకు బడా రాజకీయనేతల దగ్గరికి కూడా పడక సుఖం అందించేందుకు పంపేవారని సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. నన్ను పంపారా లేదా అనే క్లారిటీ నేనను ఇవ్వలేను కానీ.. నన్ను అలా వాడలేదని నేను చెప్పలేనని శ్రీ రెడ్డి స్పష్టం చేశారు. నేనయినా, నా ఫ్రెండ్స్ అయినా రాజకీయ నేతలను కలిసిన సందర్భాల్లో తీసిన పిక్స్ కూడా మా దగ్గర చాలా ఆధారాలున్నాయని అన్నారు శ్రీ రెడ్డి. అససరమైతే వాటిని బయటపెట్టడానికి భయపడేది లేదన్నారు. కొందరు నేతలు పందుల్లా వుంటారని, నోరు కంపు కొడుతున్నా.. మీద పడితే భరించాల్సి వుంటుందని ఆరోపించింది శ్రీ రెడ్డి.

ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో వున్న వాళ్లపై చిన్న చూపు చూస్తున్నారు. చూసే వాళ్లకు వందకి వంద శాతం చూసే హక్కుంది కానీ చిన్న చూపు చూస్తేనే బాధేస్తుందన్నారు శ్రీ రెడ్డి. అంతే కాదు మూడ్ ను బట్టి విడియోలు ఎవరైనా చూస్తారని, నేను రకరకాల విడియోలు చూస్తానని.. నేను పోర్న్ విడియోస్ కూడా చూస్తానని శ్రీ రెడ్డి అన్నారు.

 

హిరోయిన్ కో ఆర్డినేటర్ గానే కాక ఈవెంట్ మేనేజర్ గానూ వ్యవహరించే చాంద్ ఖాన్... పలువురు ఆశావహ హీరోయిన్లతో అసభ్యంగా మాట్లాడటమే కాక.. ట్రాప్ చేసేందుకు ప్రయత్నాలు చేయటం, కాజల్ అగర్వాల్ స్థాయికి తీసుకెళ్లే అంత నెట్ వర్క్ నాకుంది అంటూ చెప్పి లోబరుచుకోవటం లాంటి కార్యక్రమాలు చేశాడు. ఈ కో ఆర్డినేటర్ చాంద్ ఖాన్ తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో వున్న నేత ఒకరు సంబంధాలు నెరపడం చూస్తే పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ నేతతో కలిసి కొందరు ముద్దుగుమ్మలు, హిరోయిన్ కో ఆర్డినేటర్ చాంద్ ఖాన్ రాసలీలల ఫోటోలు లీకయ్యాయి. దీన్ని బట్టే సినిమా మాఫియాతో రాజకీయాలకు ఏ రకమైన సంబంధాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.