సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలతో అతడిని అభిమానులు కలియుగ కర్ణుడిగా అభివర్ణిస్తున్నారు. ఇటీవల ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం కూడా సోనూసూద్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

కరోనా సమయంలో సోనూ సూద్ దేశం మొత్తం చేసిన సహాయ కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం, ఆర్థిక సహాయం, ఉద్యోగాలు కల్పించడం, ఆక్సిజెన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు సోనూ సూద్ ఎన్నో చేశారు. 

సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలతో అతడిని అభిమానులు కలియుగ కర్ణుడిగా అభివర్ణిస్తున్నారు. ఇటీవల ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం కూడా సోనూసూద్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకి గాను ఇప్పటికే పలు సంస్థలు అతడిని సత్కరించాయి. 

తాజాగా సోనూసూద్ మరో అరుదైన గౌరవం పొందారు. యూఏఈ ప్రభుత్వం సోనూసూద్ కి గోల్డెన్ వీసాని బహుకరించింది. సోనూసూద్ చేస్తున్న సేవకి గాను ఆయనకి ఇస్తున్న గౌరవంగా దుబాయ్ ప్రభుత్వం పేర్కొంది. 

యూఏఈ గోల్డెన్ వీసా పొందడం అంటే మాటలు కాదు. భారీగా పెట్టుబడులు పెట్టేవారు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు మాత్రమే గోల్డెన్ వీసాని పొందేందుకు అర్హులు. ఆ గౌరవం సోనూసూద్ కి దక్కింది. 

దీనిపై సోనూసూద్ మాట్లాడుతూ.. దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇష్టమైన ప్రదేశాల్లో దుబాయ్ ఒకటి అని సోనూసూద్ అన్నారు. సినిమాల విషయానికి వస్తే సోనూసూద్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు.