Asianet News TeluguAsianet News Telugu

చంపేస్తామంటూ ఒక్క రోజు 500బెదిరింపు కాల్స్ః `తమిళనాడు బీజేపీ`పై నటుడు సిద్ధార్థ్‌ ఆరోపణలు

హీరో సిద్ధార్థ్‌ బీజేపీ కార్యకర్తలు, నాయకులపై ఆరోపణలు చేశారు. తనని చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

actor siddharth said  i receives rape death threat calls from thamilanadu bjp it cell  arj
Author
Hyderabad, First Published Apr 29, 2021, 2:06 PM IST

హీరో సిద్ధార్థ్‌ బీజేపీ కార్యకర్తలు, నాయకులపై ఆరోపణలు చేశారు. తనని చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా బీజేజీ నాయకులపై ఫైర్‌ అయ్యారు సిద్ధార్థ్‌. గతంలోనూ దేశంలో జరుగుతున్న దాడులపై ఆయన స్పందించారు. మతం పేరుతో జరిగే దాడులను తీవ్రంగా ఖండించారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆయన గళమెత్తారు. అప్పట్లో వార్తల్లో నిలిచారు. సమయం చిక్కినప్పుడల్లా సామాజిక అంశాలపై స్పందిస్తూనే ఉన్నారు సిద్ధార్థ్‌. తాజాగా ఆయన తమిళనాడు బీజేపీ పై ఫైర్‌ అయ్యారు. 

తమిళనాడు బీజేపీ ఐటీ సెల్‌ విభాగం తన ఫోన్‌ నెంబర్‌ని లీక్‌ చేశారని, దానికి ఒక్క రోజులు 500కాల్స్ వచ్చాయని, అందులో తనని చంపేస్తామని, అత్యాచారం చేస్తామని వేధింపులకు గురి చేస్తున్నట్టు తెలిపారు. `నా ఫోన్‌ నెంబర్‌ని తమిళనాడు బీజేపీ సభ్యులు లీక్‌ చేశారు. 24గంటల్లో నాకు, నా కుటుంబ సభ్యులకు ఐదు వందల ఫోన్‌ కాల్స్ వచ్చాయి. అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. అన్ని ఫోన్‌ నంబర్స్ ని రికార్డ్ చేశాను. వాటిని పోలీసులకు అందజేశాను. ఈ సందర్భంగా నేను భయపడటం లేదు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొవాలనుకుంటున్నా` అని తెలియజేస్తూ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలను ట్యాగ్‌ చేశారు సిద్ధార్థ్‌. 

ఈ సందర్బంగా సోషల్‌ మీడియా సంభాషణ పంచుకుంటూ, `తమిళనాడు బీజేపీ సభ్యులు నిన్న నా నంబర్‌ లీక్‌ చేసి, నన్ను దాడి చేసి వేధించామని ప్రజలకు చెప్పేందే అనేక పోస్ట్ ల్లో ఇదొకటి. `దీంతో మరోసారి నోరు తెరవకూడదు` అనుకుంటున్నారు. మేం కోవిడ్‌ నుంచి బయటపడవచ్చేమో, కానీ వీరి నుంచి బయటపడటం ఎలా?` అని ప్రశ్నించారు సిద్ధార్థ్‌. దీంతో ఇప్పుడీ పోస్ట్ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నేషనల్‌ వైడ్‌గా ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. దీనిపై తమిళనాడు డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ ఎస్‌ స్పందించారు. దీనిపై మేము మీకు అండగా ఉంటామని, పోరాడతామని బరోసా ఇచ్చారు. తమకి కొంత సమయం ఇవ్వాలని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios