విలన్‌గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యప్రకాష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఓ సినిమా షూటింగ్ లో తనకు జరిగిన అవమానాన్ని పంచుకున్నారు.
నటుడు సత్య ప్రకాష్(Satya Prakash) విలన్(Villain)గా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తనదైన విలనిజంతో ఆడియెన్స్ ని అలరిస్తున్న ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. దాదాపు ఆరు వందలకుపైగా ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. ఆ మధ్య తన కుమారుడిని తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ `ఉల్లాల ఉల్లాల` చిత్రాన్నిరూపొందించారు. ఆ సినిమా ఆశించినస్థాయిలో సక్సెస్ కాలేదు.
ఈ నేపథ్యంలో నటుడిగా కంటిన్యూ అవుతున్న ఆయన ఈ మధ్య చాలా తక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూతో హాట్‌టాపిక్ అయ్యారు. ఇందులో ఆయన చేసిన కామెంట్లు, ఆయన షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించారు. ఓ టీవీషోలో పాల్గొన్నసత్య ప్రకాష్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తననిలో షూటింగ్‌లో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తీవ్రంగా అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
సత్య ప్రకాష్ చెబుతూ, తాను విజయనగరం(ఏపీ)లో జన్మించానని, అయితే ఒడిశాలో పెరిగినట్టు తెలిపారు. మొదట్లో బ్యాంక్ ఉద్యోగం చేశానని చెప్పారు. ఆ సమయంలో తానేదో పిచ్చిపనులు చేస్తుంటే ఓ దర్శకుడు చూసి `రా బాబు` అంటూ పిలిచి సినిమాల్లో వేషం ఇచ్చారని, కానీ ఆయన తనని ఆర్టిస్ట్ ని చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నారని పేర్కొన్నారు(నవ్వుతూ) సత్యప్రకాష్. తనని నటుడిని చేసి జీవితంలో పెద్ద తప్పు చేశానని ఆయన ఫీల్ అవుతుంటారని సత్యప్రకాష్ సరదాగా చెప్పొకొచ్చారు. అయితే ఇప్పటి వరకు తారు ఆరువందల సినిమాల్లో నటించానని చెప్పుకుంటూ తిరుగుతానని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఓ సందర్భంలో సినిమా సెట్‌లో తనకు జరిగిన అవమానంపై సత్య ప్రకాష్ ఓపెన్ అయ్యారు. ఒక సినిమా షూటింగ్‌లో సుమన్‌తో ఫైట్ సీన్‌లో నటించాల్సి ఉందని, ఆయన కొట్టినప్పుడు రియాక్షన్ ఇవ్వాలి. కానీ తానివ్వలేదట. ఒకటి రెండుసార్లు అలా అయ్యేటప్పటికీ పక్కనే ఉన్న కో డైరెక్టర్ తనని ఉద్దేశించి `ఇలాంటి దరిద్రపువాళ్లంతా ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది` అని అన్నారని చెప్పి ఆవేదన చెందాడు సత్యప్రకాష్. సత్య ప్రకాష్ మొదట్లో దర్శకుడు రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసేందుకు వెళ్లి, నటుడిగా మారారు.
సత్య ప్రకాష్ 1996లో సినీ కెరీర్‌ని ప్రారంభించి ఇప్పటి వరకు నటుడిగా రాణిస్తున్నారు. వెంకటేష్ నటించిన `చిన్నబ్బాయి` చిత్రంతో మొదలైంది ఆయన సినీ ప్రయాణం. `మాస్టర్`, `సుల్తాన్`,`సీతారామరాజు`, `కృష్ణబాబు`, `నరసింహనాయుడు`, `ఎదురులేని మనిషి`,`భలేవాడివిబాసు`, `సీమ సింహాం`, `ధమ్`, `సీతయ్య`, `డేంజర్`, `పోకిరి`, `అశోక్`, `లక్ష్మీ`, `మైసమ్మా ఐపీఎస్`, `విక్టరీ`, `ఏక్ నిరంజన్`, `రగడ`, `దొంగల మూట`, `బెజవాడ`, `షాడో`, `పవర్`, `డిక్టేటర్`, `నేనే రాజునేనే మంత్రి`, ఇటీవల `సేనాపతి `ఓటీటీ చిత్రంలో నటించారు.
