వెంకటేశ్వర మాలలో రాజీవ్ కనకాల, తిరుమలలో సందడి చేసిన సుమ దంపతులు
ఈ మధ్య సెలబ్రిటీలు వరుసగా ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నారు... దేవుని సేవలో తరించడంతో పాటు.. ప్రత్యేకంగా మాలలు కూడా వేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల ప్రత్యేకంగా దేవుని మాలలో కనిపించాడు.

ఈ మధ్య సెలబ్రిటీలు వరుసగా ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నారు... దేవుని సేవలో తరించడంతో పాటు.. ప్రత్యేకంగా మాలలు కూడా వేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల ప్రత్యేకంగా దేవుని మాలలో కనిపించాడు.
ఈమధ్య టాలీవుడ్ సెలబ్రిటీలు దేవుని సేవలతో తరిస్తున్నారు. ప్రత్యేక మొక్కులు మొక్కుతూ.. మాలలు వేసుకుంటూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈక్రమలో టాలీవుడ్ ఫిల్మ్ సెలబ్రిటీలో ఆధ్యాత్మిక చింతన ఎక్కవగా ఉన్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, శర్వానంద్ లాంటి వారు మాలలో కనిపిస్తున్నారు. తాజాగా మాస్ హీరో విశ్వక్ సేన్ కూడా ఆంజనేయ మాలలో కనిపించాడు. ఇలా దేవుని సేవలో తరించే సినిమా స్టార్లు చాలా మంది ఉన్నారు. తాజాగా స్టార్ యాంకర్ సుమ భర్త, ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల ప్రత్యేక మాలలో కనిపించారు.
టాలీవుడ్ స్టార్ సీనియర్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ అంటూ సుమ రోజు ఆడియన్స్ ను అలరిస్తుంది. ఇక రాజీవ్ కనకాల మాత్రం అప్పడప్పుడు తెరపై మెరుస్తూ.. హడావిడి చేస్తుంటాడు. రాజీవ్ నటించిన సూపర్ హిట్ సినిమాలెన్నో... ఇక రీసెంట్ గా రాజీవ్ కనకాల నటించిన పెదకాపు సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అంతే కాదు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు రాజీవ్ కనకాల.
ఇక అసలు విషయం ఏంటంటే..? తాజాగా రాజీవ్ కనకాల ప్రత్యేమైన బట్టల్లో కనిపించాడు. పసుపుబట్టలు వేసుకున్నాడు రాజీవ్. అయితే ఆయన వెంకటేశ్వర మాల వేసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు తాజాగా సుమ, రాజీవ్ తిరుమలలో కనిపించారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సుమ.. తన ఇన్‌స్టాలో ఒక వీడియో స్టోరీ పెట్టింది. ఆ వీడియోలో సుమ అండ్ రాజీవ్ తిరుమల ఘాట్ రోడ్డులో కనిపిస్తున్నారు. కారు పక్కన ఆపి తిరుమల కోన అందాలను సుమ దంపతులు వికిస్తున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తుంది. అలాగే ఆ వీడియో రాజీవ్ వెంకటేశ్వర స్వామి మాల ధరించి కనిపిస్తున్నాడు.