Asianet News TeluguAsianet News Telugu

Rajababu: ప్రముఖ నటుడు రాజబాబు అకాల మరణం...!

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి మరణించినట్లు తెలుస్తుంది.  రాజబాబు మృతి వార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

actor rajababu passes away tollywood celebs mourns
Author
Hyderabad, First Published Oct 25, 2021, 7:40 AM IST

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటుడు రాజబాబు తుది శ్వాస విడిచారు.64ఏళ్ల రాజబాబు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి మరణించినట్లు తెలుస్తుంది.  రాజబాబు మృతి వార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

 రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు. 
రాజబాబు ను అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు . తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి .తన చుట్టూ వున్న వారిని  హాయిగా నవ్విస్తూ వుండే రాజ బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతి కలిగించింది . 

Also readబిగ్ బాస్ 5 నుంచి ప్రియా అవుట్.. ఇద్దరూ ఎలిమినేట్ అనుకున్నారు, కానీ..

గోదావరి పల్లెటూరి పాత్రాలకు Rajababu చాలా ఫేమస్. ఆయన యాసకు, ఆహార్యానికి ఆ పాత్రలు చక్కగా కుదిరేవి. అందుకే గోదావరి గ్రామీణ పాత్రలకు ఆయనను దర్శక నిర్మాతలు తీసుకునేవారు. 
రాజబాబు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 1957 జూన్‌ 13న రాజబాబు జన్మించారు. చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి కలిగిన రాజబాబు అనేక నాటకాల్లో నటించారు. దేశవ్యాప్తంగా తిరిగి నాటక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. 1995లో వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో రాజబాబు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

Also read మోనితను బిడ్డతో సహా ఇంట్లో తెచ్చి పెట్టుకోనున్న డాక్టర్ బాబు.. ఛీ ఇదొక సీరియలా అంటూ?

సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, Bharat ane nenu తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. 


సినిమాలే కాకుండా అనేక సీరియల్స్ లో రాజబాబు కీలక రోల్స్ చేశారు.  వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం ఆయన అలరించారు. 2005లో అమ్మ సీరియల్‌లోని పాత్రకుగానూ ఆయన్ని నంది అవార్డు వరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios