నటుడు రాహుల్ రామకృష్ణ బలగం ఫేమ్ ప్రియదర్శిని ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. మా ఇద్దరి మధ్య పోలిక పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.  


టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో రాహుల్ రామకృష్ణ ఒకరు. రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈయన ట్వీట్స్ భిన్నంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఊహించని పోస్ట్స్ పెడుతుంటాడు. బాల్యంలో నేను రేప్ కి గురయ్యానని ఒకసారి ట్వీట్ చేశాడు. అది సంచలనమైంది. మరొక సందర్భంలో నటన మానేస్తున్నానని ట్వీట్ చేశాడు. ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్ వివరణ కోరారు. 

నేను జస్ట్ జోక్ చేశాను. కోట్ల, సంపాదన లగ్జరీ లైఫ్ ఎవరైన కాదనుకుంటారా? అని కామెంట్ చేశాడు. అది నెటిజెన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది. తాజాగా రాహుల్ రామకృష్ణ తోటి నటుడు ప్రియదర్శి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఒకరు బలగం, ఇంటింటి రామాయణం చిత్రాలను ఉద్దేశిస్తూ రాహుల్, ప్రియదర్శి దూసుకుపోతున్నారని పోస్ట్ పెట్టారు. దీనిపై రాహుల్ రామకృష్ణ అభ్యంతరం చెప్పాడు. 

Scroll to load tweet…

ప్రియదర్శితో నాకు పోలికా. ప్రియదర్శి నా మిత్రుడు. కష్టపడే తత్త్వం కలిగిన గొప్ప నటుడు. ఈ విధంగా నాతో ప్రియదర్శిని పోల్చడం చీఫ్ గా ఉంది. ఇది నేను ఒప్పుకోను. ప్రియదర్శి నా కంటే మంచి నటుడు, అని ట్వీట్ చేశాడు. రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్ అవుతుంది. రాహుల్ రామకృష్ణ నిజంగా చెప్పాడా? సెటైర్ వేశాడా? అనేది అర్థం కాలేదు. ఆ మధ్య హుషారు చిత్ర దర్శకుడు రాహుల్ రామకృష్ణ మీద ఆరోపణలు చేశాడు.

భరత్ అనే నేను మూవీలో తన నటనతో పోటీపడలేని మహేష్ బాబు నా సన్నివేశాలు కొన్ని ఎడిటింగ్ లో లేపేశాడని రాహుల్ రామకృష్ణ తనతో చెప్పినట్లు హుషారు డైరెక్టర్ ఆరోపణలు చేశారు. కాగా రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శి కాంబోలో తెరకెక్కిన బ్రోచేవారెవరురా, జాతిరత్నాలు సూపర్ హిట్ కొట్టాయి. రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శి కాంబినేషన్ బాగుంటుంది.