విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌కి గాయాలయ్యాయి. ఆయన చికిత్స చేయించుకోవడానికి హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్‌ రాజ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించడం విశేషం.

విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌కి గాయాలయ్యాయి. ఆయన చికిత్స చేయించుకోవడానికి హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్‌ రాజ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించడం విశేషం. `ఒక చిన్న తప్పిదం. చిన్న ఫ్రాక్చర్‌. నా స్నేహితుడు డాక్టర్‌ గురువరెడ్డి వద్దకి సర్జరీ కోసం హైదరాబాద్‌ వెళ్తున్నా. సురక్షితమైన చేతుల్లోకి వెళ్తున్నా. నేను బాగానే ఉన్నాను. ఎవరూ చింతించకండి. మీ ఆలోచనల్లో ఉంచుకోండి` అని ట్వీట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్‌. ఇప్పుడిది వైరల్‌ అయ్యింది. 

అయితే గాయాలకు గల కారణాలు తెలపలేదు. కానీ ధనుష్‌ కొత్త సినిమా షూటింగ్‌లో ఆయనకు గాయాలైనట్టు సమాచారం. చెన్నైలో జరుగుతున్న సినిమా చిత్రీకరణలో ప్రకాష్‌ రాజ్‌ చేతికి తీవ్రంగా గాయాలయ్యాయని, సాయంత్రం హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకోబోతున్నారట. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే ఇటీవల `మా` ఎన్నికల విషయంలో హాట్‌ టాపిక్‌గా మారారు ప్రకాష్‌ రాజ్‌. `మా` అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చోబోతున్నట్టు ప్రకటించిన మొదటి వ్యక్తి ప్రకాష్‌ రాజ్‌. అంతేకాదు అంతే స్పీడ్‌గా ఆయన నా ప్యానెల్‌ని ప్రకటించారు. అదే సమయంలో ఏకంగా ప్రెస్‌మీట్‌ కూడా పెట్టి తాను ఏం చేయాలనుకున్నానో వివరించారు. 

ఆ టైమ్‌లోనే లోకల్‌, నాన్‌ లోకల్‌ విషయంలో వివాదాల్లో ఇరుక్కున్నాడు. అప్పటి నుంచి ఆయన `మా` ఎన్నికలపై మాట్లాడటం లేదు. కానీ సైలెంట్‌గా ట్విట్టర్‌ వేదికగా పరోక్షంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటీవల `తెగేదాక లాక్కండి` అనే ట్వీట్‌ సైతం దుమారం రేపింది. ఇదిలా ఉంటే చివరగా ప్రకాష్‌ రాజ్‌.. పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌`లో లాయర్‌గా నటించి ఆకట్టుకుంటున్నారు. మరోవైపు వెబ్‌ సిరీస్‌లతోనూ ఫుల్‌ బిజీగా ఉన్నారు ప్రకాష్‌ రాజ్‌.