చెన్నై నగరంలో అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో నటుడు పవర్ స్టార్ శ్రీనివాసన్ అదృశ్యమైనట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే కంప్లైంట్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసులకు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం సినీ నటుడు పవర్ స్టార్ శ్రీనివాసన్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రం, దిల్లీ పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ మధ్య అతడిపై నగదు మోసం చేసినట్లు కేసు కూడా నమోదైంది.

ఈ క్రమంలో ఆయన కనిపించడం లేదని అతడి భార్య జూలీ అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులకు పవన్ స్టార్ ఊటీలో ఉన్నారని తెలిసింది. ఓ పనిపై ఊటీ వచ్చానని, క్షేమంగానే ఉన్నానని పవర్ స్టార్ శ్రీనివాసన్ చెప్పడంతో అతడు భార్య కూడా ఊటీ వెళ్లారు. ఆ తరువాత కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు.