ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. దర్శకుడిగా, రచయితగా పోసాని ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఇటీవల ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వరుస చిత్రాల్లో నటిస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ప్రస్తుతం పోసానికి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. 

పోసానిని పరామర్శించేందుకు వైసిపి నేతలు క్యూ కడుతున్నారు. వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం రోజు యశోద ఆసుపత్రికి వెళ్లి పోసానిని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందొ అడిగి తెలుసుకున్నారు. పోసాని కృష్ణమురళి ఇటీవల మజిలీ, చిత్రలహరి లాంటి చిత్రాల్లో నటించారు. ఆ రెండు చిత్రాల్లో పోసాని నటనకు ప్రశంసలు దక్కాయి. 

పోసాని కృష్ణమురళి వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ పలు సంధర్భాల్లో మీడియా సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడే పోసాని టిడిపి నేతలపై ఎన్నికల సంధర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ప్రశంసలు కురిపించారు. అలా పోసాని వైసిపి నేతలకు చేరువయ్యారు.