Asianet News TeluguAsianet News Telugu

అప్పట్నుంచి భయంకరమైన పీడకలలు.. లైంగిక ఆరోపణలపై స్పందించిన నటుడు పరల్‌ వీ పూరి

కష్టకాలంలో తనకు అండగా నిలబడి, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు హిందీ నటుడు, `నాగిని 3` పేమ్‌ పరల్‌ వీ పూరి. గత కొన్ని రోజుల క్రితం బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. 

actor pearl v puri react first time on sexual allegations  arj
Author
Hyderabad, First Published Jun 28, 2021, 9:38 PM IST

కష్టకాలంలో తనకు అండగా నిలబడి, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు హిందీ నటుడు, `నాగిని 3` పేమ్‌ పరల్‌ వీ పూరి. గత కొన్ని రోజుల క్రితం బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బాలికని కిడ్నాప్‌ చేసి, పలు మార్లు అత్యాచారం చేసినట్టు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో పరల్‌ వీ పూరితోపాటు అతడి స్నేహితులను ముంబయి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. అయితే ఈ కేసులో పరల్‌ వీ కి ఎలాంటి సంబంధం లేదని, అతన్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఏక్తా కపూర్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు స్పందిస్తూ మద్దతు తెలిపారు. 

ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన రెండు వారాల తర్వాత నటుడు పరల్‌ వీ తొలిసారిగా స్పందించారు. ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. `కాలం మనుషులను ఎప్పుడూ పరీక్షిస్తుంటుంది. ఇటీవల మా నానమ్మని కోల్పోయాను. ఆమె చనిపోయిన 17వ రోజు మా అమ్మ క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఇదే విషయాన్ని నాకు చెబుతూ, మా నాన్న పంపిన పోస్ట్ పోయింది. ఆ తర్వాత ఈ భయంకరమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్నుంచి ప్రతి రోజు భయంకరమైన పీడకలలు, దానికి తోడు నేరస్థుడిని అనే భావన. ఇవన్ని నన్ను తీవ్రంగా కలిచి వేశాయి. 

నా తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో తన పక్కన లేకుండా ఓ నిస్సహాయ స్థితిలో ఉండిపోయా. ఇప్పటికీ నేను దాన్నుంచి బయటపడలేకపోతున్నా. ఇప్పుడు నా సన్నిహితులు, నాకు మద్దతుగా నిలిచిన నా వెల్‌ విషర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకునే సమయం వచ్చింది. కష్టకాలంలో నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు` అంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ ని పంచుకున్నారు పరల్‌ వీ పూరి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pearl V Puri (@pearlvpuri)

ఈ కేసులో బాధితురాలైన బాలికకు పదేళ్ల క్రితం వివాహమైందని, రెండేళ్లుగా ఆమె కనిపించడం లేదని బాధితురాలి తల్లి కోర్టుకు వెల్లడించింది. పరల్‌ వీ పూరికి ఈ కేసుకు సంబంధం లేదని, ఇవి తప్పుడు ఆరోపణలే అని ఆమె స్పష్టం చేసింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన పరల్‌ వీ పూరి 2013లో వచ్చిన `దిల్‌ కి నజర్‌ సే కూబ్‌సూరత్‌` చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత  ఎక్తాకపూర్‌ నిర్మించిన `నాగిని 3`, `బేపనా ప్యార్‌` సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల `బ్రహ్మ రాక్షసి 2` టీవీ సీరియల్‌లో నటించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios