నటుడిగా టాలీవుడ్ లో విలన్ వేషాలు, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన నోయెల్ కి 'కుమారి 21 ఎఫ్' సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఈగ, మగధీర వంటి సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు నోయెల్ ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు.

మంగలూర్ కు చెందిన కొంకణి అమ్మాయి ఈస్టర్ నోరోన్హా టాలీవుడ్ లో '1000 అబద్దాలు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక వంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.

హీరోయిన్ గా మాత్రం ఈమెకి సరైన బ్రేక్ రాలేదు. భరతనాట్యం, పాటలు పాడడంలో దిట్ట అయిన ఈస్టర్ విదేశాల్లో షోలు కూడా ఇస్తుంటుంది. ఇప్పుడు ఈ భామ నోయెల్ తో పెళ్లికి సిద్ధమవుతోంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి ఇప్పటికే చాలా కాలం అయిందట. కానీ ఈ విషయాన్ని రీసెంట్ గా రివీల్ చేసాడు నోయెల్. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది!