నటుడు నవదీప్ కాలికి గాయంతో కనిపించాడు. స్టిక్ సపోర్ట్ లేకుండా నడవలేని పరిస్థితి. దీంతో నవదీప్ కి ఏమైందని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  

జై మూవీతో హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టిన నవదీప్ కి బ్రేక్ రాలేదు. దర్శకుడు తేజా ఫుల్ స్వింగ్ లో ఉన్న టైంలో జై మూవీ విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే నవదీప్ కి హీరోగా అవకాశాలు వచ్చాయి. మనసు మాట వినదు, మొదటి సినిమా, గౌతమ్ ఎస్ ఎస్ సీ వంటి చిత్రాల్లో నటించాడు. చందమామ మూవీతో నవదీప్ హిట్ అందుకున్నాడు. అయితే అదేమీ హీరో ఆఫర్స్ తెచ్చిపెట్టలేదు. 

నవదీప్ సపోర్టింగ్, నెగిటివ్ రోల్స్ కి పడిపోయాడు. దానికి తోడు డ్రగ్స్ ఆరోపణలు. టాలీవుడ్ డ్రగ్ కేసులో నవదీప్ పేరు వినిపించింది. పలు మార్లు విచారణకు హాజరయ్యాడు. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్న నవదీప్ చివరిగా కనిపించిన చిత్రం మోసగాళ్లు. మంచు విష్ణు హీరోగా, కాజల్ మరో ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. డిజిటల్ సిరీస్లలో నవదీప్ సందడి చేస్తున్నారు. 

View post on Instagram

సడన్ గా నవదీప్ కాలికి గాయంతో కనిపించాడు. ఆయన స్టిక్ సహాయంతో నడుస్తున్నారు. గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న నవదీప్ ని వీడియో తీసి నటి తేజస్వి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతని గాయం మీద ఫన్నీ రీల్ చేసింది. అయితే నవదీప్ కి ప్రమాదం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. దీంతో టాలీవుడ్ వర్గాలు అతనికి ఏమైందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక తేజస్విని-నవదీప్ గుడ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ ఐస్ క్రీం మూవీలో లీడ్ రోల్స్ చేశారు. అడల్ట్ కంటెంట్ తో దర్శకుడు రామ్ గోపాల్ ఈ మూవీ తెరకెక్కించారు. అప్పటి నుండి వీరి పరిచయం కొనసాగుతుంది.