నరేష్-పవిత్ర లోకేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'మళ్ళీ పెళ్లి' విడుదలకు సిద్ధమైంది. అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.
నటుడు నరేష్ చేసిన సంచలన చిత్రం 'మళ్ళీ పెళ్లి'. పవిత్ర లోకేష్ ఆయనకు జంటగా నటిస్తుంది. దర్శకుడు ఎమ్ ఎస్ రాజు తెరకెక్కించారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. నటుడు నరేష్ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల సమాహారమే మళ్ళీ పెళ్లి మూవీ. నరేష్ మూడో వివాహంగా రమ్య రఘుపతిని చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నారు. కొన్నేళ్ల క్రితం విభేదాలతో విడిపోయారు. నరేష్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. రమ్య రఘుపతి విడాకులు ఇవ్వనంటున్నారు.
గత నాలుగైదేళ్లుగా నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో రమ్య రఘుపతి పలుమార్లు నరేష్ మీద ఆరోపణలు చేశారు. మైసూర్ హోటల్ లో నరేష్-పవిత్ర లోకేష్ ఉన్నారన్న విషయం తెలుసుకొని రమ్య దాడికి ప్రయత్నించారు. నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతిల ట్రయాంగిల్ డ్రామానే మళ్ళీ పెళ్లి. తన జీవితంలోని కాంట్రవర్సీకి వెండితెర రూపం ఇచ్చాడు నరేష్.
ఇటీవల విడుదలైన టీజర్ ప్రకంపనలు రేపింది. అప్పటి వరకు మళ్ళీ పెళ్లి ఆయన బయోపిక్ అన్న విషయం తెలియదు. టీజర్ లో సన్నివేశాలు చూసి అందరూ షాక్ అయ్యారు. కాగా నరేష్-రమ్య రఘుపతి మధ్య ఏం జరిగింది? పవిత్ర లోకేష్ ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఇవన్నీ అభిమానులకు చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు.
కాగా మే 26న మళ్ళీ పెళ్లి విడుదల చేస్తున్నారు. ఈ మూవీపై జనాల్లో ఆసక్తి ఉంది. కాంట్రవర్సీని నరేష్ తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు. ఈ చిత్ర నిర్మాత ఆయనే కావడం విశేషం. కమర్షియల్ గా ఈ మూవీ ఈ మేరకు ఆడుతుందో చూడాలి.
