Asianet News TeluguAsianet News Telugu

విష్ణు ప్యానల్ లో కాంట్రవర్షియల్ ఫిగర్స్ లేరు.. మద్దతు తెలిపిన నరేష్

టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. అక్టోబర్ 10న మా ఎన్నిక జరగనుంది.

Actor Naresh extended his support to Manchu Vishnu panel
Author
Hyderabad, First Published Sep 23, 2021, 4:29 PM IST

టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. అక్టోబర్ 10న మా ఎన్నిక జరగనుంది. మా ఎన్నికలో ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ తమ ప్యానల్ సభ్యులని ప్రటించేశారు. 

ప్రకాష్ రాజ్ చాలా రోజుల క్రితమే తన ప్యానల్ ప్రకటించగా.. నేడు మంచు విష్ణు కూడా తన ప్యానల్ వివరాలు రిలీజ్ చేశాడు. ఈ ప్యానల్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు. జనరల్ సెక్రటరీగా కమెడియన్ రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా సీనియర్ కమెడియన్ బాబు మోహన్ పోటీలో నిలిచారు. 

మాదాల రవి, 30 ఇయర్స్ పృథ్వి వైస్ ప్రెసిడెంట్స్ గా పోటీ లో నిలిచారు. ట్రెజరర్ గా శివ బాలాజీ.. జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు పోటీలో నిలిచారు. అర్చన, గీతా సింగ్, అశోక్ కుమార్, హరినాధ్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాజేశ్వరి రెడ్డి, శశాంక్, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, వడపట్ల, పూజిత, విష్ణు బోపన్న, స్వప్న మాధురి, శ్రీలక్ష్మి, శివన్నారాయణ, రేఖ శ్రీనివాసులు ఇతర సభ్యులుగా ఉన్నారు. 

ఇక విష్ణు తన ప్యానల్ సభ్యుల వివరాలని నటుడు నరేష్ కి పంపారు. నరేష్ ముందు నుంచి మంచు విష్ణుకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. విష్ణు ప్యానల్ వివరాలు పరిశీలించిన నరేష్ తన మద్దతు ప్రకటించాడు.విష్ణు ప్యానల్ బావుందని కితాబిచ్చారు. 

విష్ణు ప్యానల్ లో కాంట్రవర్శీ వ్యక్తులుగా ముద్ర పడినవారెవరూ లేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న వారంతా చదువుకున్నవారు, మంచి వారు అని నరేష్ అన్నారు. విష్ణు ప్యానల్ లో మహిళలకు ప్రాధాన్యత లభించింది. మొత్తంగా విష్ణు ప్యానల్ పాజిటివ్ గా ఉంది. మేనిఫెస్టో కూడా ఇంతే బావుండాలని నరేష్ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios