Asianet News TeluguAsianet News Telugu

ఛాన్స్‌ల పేరుతో బ్లూ ఫిలింస్, రెడ్ హ్యాండెండ్ గా దొరికిన నటి

 తనను బలవంతం చేసి న్యూడ్ వీడియోలు షూట్ చేసిందని చెప్పడంతో పోలీసులు ఈ ఇష్యూపై కఠిన చర్యలు తీసుకున్నారు. నందితా దత్తాతో పాటు ఆమె అసిస్టెంట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Actor Nandita Dutta arrested for running 'porn racket' jsp
Author
Mumbai, First Published Aug 1, 2021, 3:20 PM IST

శిల్పా శెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు సినీ వర్గాల్లో సెన్సేషన్ గా మారి సంచలనాలు రేపుతోంది. అది తెరపైన ఉండగానే ఇప్పుడు ఊహించని విధంగా మరో యువనటి పోర్న్ రాకెట్ కేసు బయిటకు వచ్చింది. తమ మధ్య తిరగాడే నటే కావటంతో  అంతా షాకవుతున్నారు. ఓ మోడల్ యువ నటి నందితా దత్తాపై సంచలన ఆరోపణలు చేయటంతో వెలుగులోకి వచ్చింది. తనను బలవంతం చేసి న్యూడ్ వీడియోలు షూట్ చేసిందని చెప్పడంతో పోలీసులు ఈ ఇష్యూపై కఠిన చర్యలు తీసుకున్నారు. నందితా దత్తాతో పాటు ఆమె అసిస్టెంట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు చూద్దాం...
  
 నటి నందితా దత్తా(30) ఒకప్పుడు బిజీ మోడల్‌. చాలాకాలంగా సినిమాల్లో ఆఫర్స్  కోసం ట్రై చేస్తోంది. అయితే వర్కవుట్ కాకపోవటంతో చీకటి ప్రపంచంలో భాగస్వామురాలు అవటం మొదలెట్టింది. ఆఫర్స్ దొరక్క బీ గ్రేడ్‌, చివరికి సెమీ పోర్నోగ్రఫిక్‌ కంటెంట్‌ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ వస్తోంది. అయితే అక్కడితో ఆగకుండా తనకున్న పరిచయాలతో యంగ్‌ మోడల్స్‌కు వెబ్‌ సిరీస్‌ అవకాశాలను ఎరగా చూపెట్టింది. చివరికి వాళ్లు వలలో చిక్కాక.. నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ మేరకు ఇద్దరు బాధితురాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డమ్‌ డమ్‌, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు.

నందితా దత్తా, ఆమె ఫొటోగ్రాఫర్ మైనిక్ ఘోష్ ఇద్దరూ కలిసి కొంతమంది మోడల్స్‌తో బలవంతంగా ఓ స్టూడియోలో న్యూడ్ వీడియోలు చేసి వాటిని పోర్నోగ్రఫీ వెబ్‌ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అటాక్ చేశారు. న్యూడ్ ఫొటోషూట్ జరిగిన స్టూడియో ఓనర్ బలిగంజ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని.. న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. స్టూడియోలోని కెమెరా, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకొని పలు విషయాలపై  విచారణ జరుపుతున్నారు.

నక్‌టాలాలో తన ఇంట్లో ఓ మోడల్‌ నగ్నంగా మారాలని బెదిరిస్తున్న టైంలో పోలీసులు నందితాను అడ్డుకుని.. అరెస్ట్‌ చేశారు. మరోవైపు డమ్‌ డమ్‌లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్‌ నేతృత్వంలో పోర్న్‌ షూటింగ్‌ జరుపుతున్న టైంలో పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నందితా దత్తా, తనను బలిగంజ్ స్టూడియోకి తెచ్చి బలి చేసిందని సదరు మోడల్ ఆరోపించింది. తనతో న్యూడ్ వీడియో బలవంతంగా చేయించారని, వద్దని వారిస్తున్నా అస్సలు వినలేదని చెప్పింది. 

అంతేకాదు తన ఫ్రెండ్స్‌లో ఓ యువతికి వెబ్ సిరీస్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి కోల్‌కతాలోని న్యూ టౌన్ హోటల్‌కి తీసుకెళ్లి అక్కడి హోటల్ రూములో ఆమెతో నగ్న వీడియోలు షూట్ చేయించిందని ఆమె ఆరోపించింది. దీంతో సినీ ఇండస్ట్రీలో పోర్న్ రాకెట్ వ్యవహారం సంచలనంగా మారింది. బాలీగుంజేలోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో తనపై అఘాయిత్యం జరిగిందని పేర్కొంటూ ఈ మేరకు జులై 26న న్యూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయటంతో మొత్తం వ్యవహారం బయిటకు వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios