Asianet News TeluguAsianet News Telugu

S5 Movie Review : నందమూరి తారకరత్న ‘ఎస్5’ మూవీ రివ్యూ!

నందమూరి తారకరత్న, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘S5’. ఈరోజే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయాలను రివ్యూలో చూద్దాం..
 

Actor Nandamuri Tarakaratnas S5 Movie Review!
Author
First Published Dec 30, 2022, 6:37 PM IST

నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) గతేడాది నుంచి ప్రేక్షకులను అలరించేందుకు వరుస సినిమాల్లో నటిస్తున్నారు.  పోయినేడు దేవినేని, సారధి వంటి చిత్రాలతో అలరించాడు. తాజాగా S5 : No Exit చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో తారక రత్న, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాయికుమార్, అలీ, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శ్యాముల్, రహీమ్, మిల్కిరెడ్డి, గౌతమ్ సినిమాను నిర్మించారు. భరత్ కోమలపాటి దర్శకత్వం వహించారు. మణిశర్మ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈరోజు (డిసెంబర్ 30) విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం.

కథ : ముఖ్యమంత్రిగా సుబ్రహ్మణ్యం నాయుడు (సాయికుమార్) అధికారాన్ని చెలాయిస్తుంటాడు. ఆయనకు కొడుకు సుబ్బు (తారక రత్న) అంటే పంచప్రాణాలు. నెక్ట్స్ ఎలక్షన్స్ లోనూ తానే సీఎంగా కొనసాగేందుకు పలు వ్యూహాలు రచిస్తుంటాడు. ఇందుకు కొడుకు సుబ్బు రాజకీయంగా అండగా నిలుస్తారు. ఇదిలా ఉంటే సుబ్బు పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ట్రెయిన్ లో స్పెషల్ బోగీని ఏర్పాటు చేయిస్తాడు సుబ్రహ్మణం. అయితే, అనుకోకుండా బోగీలోకి సన్నీ (ప్రిన్స్) మ్యూజిక్ ట్రూప్ కూడా ఎక్కుతుంది. ఫలితంగా సుబ్బు, స్ననీ టీమ్ మధ్య గొడవ జరుగుతుంది. దిగుదామనుకుంటే డోర్స్ ఓపెన్ కావు. దీంతో మధ్యలో ట్రైయిన్ ఆగితే దిగేందుకు సన్నీ టీమ్ సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో బోగీలోని ఒక్కొక్కరు మిస్ అవుతూ ఉంటారు. దానికితోడు బోగీకి మంటలు అంటుకుంటాయి. ఈ పరిస్థితి నుంచి సుబ్బు, సన్నీ ఎలా బయటపడ్డారు? ట్రైయిన్ డోర్స్ ఎందుకు ఓపెన్ కాలేదు? ఒక్కొక్కరుగా ఎందుకు మిస్సయ్యారు? వాళ్లు మంచి కలిశారా లేదా? ఇంతకి ట్రైన్‌లో ఏముందనేది మిగతా కథ. 

విశ్లేషణః హార్రర్ థిల్లర్ గా ‘S5 : No Exit’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు భరత్ కోమలపాటి ఫస్ట్ సీన్ నుంచే డైరెక్ట్ గా కథలోకి వెళ్లారు. ముందే స్టోరీలైన్ మొత్తం అర్థమయ్యేలా చూపించాడు. అధికారం కోసం పాలకులు ఎలాంటి క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటారనేది సినిమాలో చూపించారు. హార్రర్ థిల్లర్ జోనర్ లో వచ్చిన ఈమూవీలో ట్రైయిన్ లో జరిగే సన్నివేశాలే ప్రధానంగా ఉంటాయి. ఆయా సీన్లు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. దెయ్యం ఎపిసోడ్‌ సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తూ భయపెడుతుంది. మరోవైపు బిగ్‌ బాస్‌ షో పేరుతో అలీ చేసే కామెడీ కాసేపు అలరించింది. అలాగే సునీల్‌ సైతం నవ్వించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఓవర్‌గానూ అనిపిస్తుంది. కానీ బోగీలో టెన్షన్ వాతావరణాన్ని ఆసక్తికరంగా చూపించారు. లాజిక్ లేని సీన్స్, అనవసరమైన సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగింది. కానీ,  ద్వితీయార్థంలోని ట్విస్టులు ఆకట్టుకుంటాయి.  క్లైమాక్స్ లో సుబ్బు ఇచ్చిన ట్విస్టు అదిరిపోయేలా ఉంటుంది. సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అయితే ఇంకా గ్రిప్పింగ్‌గా, బలమైన కంటెంట్‌తో కామెడీ పాళ్లు పెంచి చేస్తే సినిమా బాగుండేది. 

నటీనటులు : సీఎం పాత్రలో సీనియర్ నటుడు సాయికుమార్ ఒదిగిపోయారు. నెగటివ్‌ షేడ్‌లో తారక రత్న పాత్ర బాగుంటుంది. పెర్ఫామెన్స్ ఇంకాస్తా బాగుండాల్సింది. ఆయన నెగటివ్‌ పాత్రలకు యాప్ట్ అనిపించేలా గెటప్‌ ఉండటం విశేషం. మరోవైపు నెగెటివ్ షేడ్స్  లో ప్రిన్స్ మెప్పించాడు. టీసీగా అలీ, యూట్యూబర్ గా సునీల్ అలరించారు. కామెడీ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది. వీరితోపాటు మెహబూబ్ దిల్ సే, సురేష్ వర్మ, రఘు, రితుజా సావంత్, అవంతిక హరి తమతమ పాత్రల మేరకు నటించారు. 

టెక్నీకల్ టీం : ‘గురుడవేగ’ అంజి ఈ చిత్రాన్ని మంచి సినిమాటోగ్రఫీని అందించారు. మణిశర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ లోపం చాలా కనిపిస్తోంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. సీజీ వర్క్ ఆకట్టుకోలేదు. గ్యారీ బీహెచ్, రియల్ సతీశ్ వంటి మంచి టెక్నీషియన్స్ నుంచి మెరుగైన రిజల్డ్ తీసుకోలేదనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ చిత్రం ఓ టైమ్‌ పాస్‌ మూవీలా ఉంటుందని చెప్పొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios