ఊహించని ఘోర రోడ్డు ప్రమాదం తాజాగా యువ నటుడిని బలితీసుకుంది. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ (39) ఈ తెల్లవారు జామున ప్రాణాలు ఒదిలారు. 

ప్రమాదాలు ఎప్పుడు ఏవైపు నుంచి వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. ఊహించని ఘోర రోడ్డు ప్రమాదం తాజాగా యువ నటుడిని బలితీసుకుంది. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ (39) ఈ తెల్లవారు జామున ప్రాణాలు ఒదిలారు. 

అందుతున్న వివరాల ప్రకారం తెల్లవారు జామున 4.30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొల్లం సుధీ టివి కార్యక్రమాలతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన చేసే మలయాళీ టివి షోలు అందరిని ఎంతగానో అలరించాయి. ఇప్పుడు కూడా టీవీ ప్రోగ్రాం ముగించుకుని తన తోటి ఆర్టిస్టులతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

వారు ప్రయాణిస్తున్న కారు ఒక గూడ్స్ వెహికల్ ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొల్లం సుధీ తలకు బలమైన గాయం తగిలింది. దీనితో దగ్గర్లోని కొడుంగలూర్ లో ఓ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. బలమైన గాయం కావడంతో రక్త స్రావం జరిగి కొల్లం సుధీ తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో మలయాళీ చిత్రం పరిశ్రమ మొత్తం దిగ్బ్రాంతికి గురైంది. 

కొల్లం సుధీ టివి కార్యక్రమాలతో ప్రతి ఇంట్లో సభ్యుడిగా మారిపోయేంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. దీనితో కొల్లం సుధీ మరణం పట్ల అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక అతని కుటుంబ సభ్యుల పరిస్థితి అయితే మాటల్లో వివరించలేం. 

ఈ ప్రమాదంలో అతడితో ప్రయాణిస్తున్న ఇతర ఆర్టిస్టులు ఉల్లాస్, మహేష్, బిను ఆదిమల్లు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతోంది. ఇంత పిన్న వయసులో కొల్లం సుధీ మరణించడంతో మలయాళీ చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకుంది. కొల్లం సుధీ బుల్లితెర మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా తన ప్రతిభ చాటారు. కంటరి, కట్టపనయిలే, రిత్విక్ రోషన్ లాంటి చిత్రాల్లో నటించిన సుధీ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కొల్లం సుధీ భార్య రేణు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.