మాదాల రంగారావు కన్నుమూత!

First Published 27, May 2018, 10:15 AM IST
actor madala rangarao passed away
Highlights

ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో

ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లోచికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మే 19న అర్ధరాత్రి శ్వాసకోస వ్యాధితో హాస్పిటల్ లో చేరిన ఆయన వెంటిలేటర్ సహాయంతో శ్వాసను తీసుకుంటున్నట్లు నాలుగు రోజుల కిందట ఆయన కుమారుడు వెల్లడించారు. శరీరంలో పలు అవయవాలు పనితీరు మందగించడంతో వైద్యుల ప్రయత్నం ఫలించలేదు.

1980లలో ప్రేమకథా చిత్రాలహవా నడుస్తున్నప్పుడే విప్లవాత్మక చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్నాడు. 'ఎర్రమల్లెలు','విప్లవశంఖం','ఎర్ర సూర్యుడు','ప్రజాశక్తి' వంటి చిత్రాల్లో నటించిన మాదాల రంగారావు రెడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. విప్లవ చిత్రాల దర్శకుడు కృష్ణతో కలిసి పని చేశారు. తన సొంత బ్యానర్ పై చేసిన 'యువతరం కదిలించింది' సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికై బంగారు నంది పురస్కారం దక్కించుకుంది. 

loader