‘నేనేమైనా పిచ్చోడినై వెనక్కి వచ్చానా..?’

actor kota srinivasa rao sensational comments on pawan political entry
Highlights

పవన్ రాజకీయ ప్రవేశంపై కోటా సంచలన వ్యాఖ్యలు

సినీ రంగంలో 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కోటా శ్రీనివాసరావు. రాజకీయ అనుభవం కూడా ఉన్న ఆయన.. గతంలో ఎమ్మెల్యేగానూ గెలిచారు.  ఆ తర్వాత ఏమైందో తెలీదు.. రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సినిమాలే ప్రపంచంగా గడిపేస్తున్నారు. కాగా.. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ కోటా ఏమన్నారంటే.. సినిమా వాళ్లకు రాజకీయాలు సెట్ కావన్నారు. అసలు రాజకీయ వాతావరణమే సినిమాలకు పడదన్నారు.

"అసలు రాజకీయాలు మనకెందుకు చెప్పండి... నేనే వెనక్కి వచ్చేశాను.. ఊరికే పిచ్చోడినై వచ్చానా.? రజనీకాంత్ వస్తానని చెప్పడు... వెళ్తానని చెప్పడు. పెద్దవాళ్లే అలా ఆలోచిస్తున్నప్పుడు .. కుర్రాడు ఆయన. వాళ్ల అన్నకు జరిగిందాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా... సినిమా వాళ్లకు ఆ వాతావరణం పడదు" అన్నారు. సర్వత్రా చర్చనీయాంశమైన కోటా వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తారో లేదో  చూడాలి. 

loader