టాలీవుడ్ యాక్టర్ కమల్ కామరాజు పోలీసులకు దొరికిపోయాడు.. అంతే కాదు ఈ విషయాన్నిస్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు కమల్. 

సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్ట్ పెట్టాడు కమల్ కామరాజు.. చాలా మంది తమ సినిమా అప్‌డేట్స్‌ కోసం.. తమ పర్సనల్ విషయాలు.,. టూర్లు.. ఇతర విషయాలు పంచుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కాని తనపై పోలీస్ కేస్ పెట్టారంటూ వెల్లడించి షాక్ ఇచ్చాడు టాలీవుడ్ యాక్టర్ కమల్‌ కామరాజు. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ‘నేను పోలీసులకు దొరికిపోయాను’ అంటూ రాసుకొచ్చాడు. 

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటే.. కమల్ కామరాజు తన బైక్ ను స్పీడ్ గా నడిపాడు. రోడ్లు ఖాళీగా ఉండటంతో.. ఇంకాస్త స్పీడ్ పెంచాడు. దాంతో అది ట్రాఫిక్ కంట్రోలర్ ఫోటో తీసి ఛలాన్ ఇంటికి పంపించారు. దాంతో షాక్ అయిన కమల్ కామరాజు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇంతకీ కమల్ ఏమని పోస్ట్ పెట్టాడంటే.. 

Scroll to load tweet…

 ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఆత్రుత ఆపుకోలేక 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్నే నేను స్పీడుగా వెళ్లడాన్ని గమనించి నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు, వారు అభివృద్ధి చేసిన పద్ధతులకు థాంక్స్ అంటూ పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన ఓ ఫోటోని కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.