తమిళ చిత్ర పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జేకే రితేష్(46) శనివారం కన్నుమూశారు. పార్లమెంటు మాజీ సభ్యుడిగా కొన్నేళ్లపాటు రాజకీయాల్లో కూడా సక్సెస్ చూసిన ఆయన గుండెపోటుతో మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు..
తమిళ చిత్ర పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జేకే రితేష్(46) శనివారం కన్నుమూశారు. పార్లమెంటు మాజీ సభ్యుడిగా కొన్నేళ్లపాటు రాజకీయాల్లో కూడా సక్సెస్ చూసిన ఆయన గుండెపోటుతో మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు.. నిత్యం చలాకీగా కనిపించే రితేష్ 2007లో ‘కానల్‌నీర్’ చిత్రం ద్వారా సినీ కెరీర్ ను మొదలుపెట్టారు.
కొద్దీ కాలాం తరువాత మెల్లగా ఆయన సినిమాలను తగ్గించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా సొంత నియోజకవర్గం రామనాథపురంలో పోటీచేసి విజయం సాధించారు.ఆ తరువాత డీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చిన రితేష్ 2014లో జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. జయలలితకు సన్నిహితంగా ఉంటూ మంచి నేతగా ఎదిగిన రితేష్ కు ఇదివరకే 2016లో ఒకసారి గుండెపోటు వచ్చింది.
రీసెంట్ గా ఎలక్షన్ ప్రచారాల్లో బిజీగా పాల్గొన్న రితేష్ శనివారం పార్టీ పనులు ముగించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హాస్పటల్ కి తీసుకెళ్లడంతో అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
