ఆ ఛానెల్, సంధ్యపై పరువు నష్టం దావా వేస్తా : జీవిత

First Published 17, Apr 2018, 6:47 PM IST
Actor jeevitha dismisses sexual abuse charges levelled junior artists
Highlights

లీగల్ యాక్షన్ కి సిద్ధం - జీవిత రాజశేఖర్

శ్రీరెడ్డి రేపిన క్యాస్టింగ్ కౌచ్ దుమారం రోజు రోజుకు పెద్ద చర్చ అవుతున్నది. ఆదివారం జూనియర్ ఆర్టిస్టులంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తమకు ఎంతో అన్యాయం జరిగిందంటు మా పోరాటం ఆగదు అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా జీవితా రాజశేఖర్ పై చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి. జీవితా వాళ్లాయన దగ్గరకు అమ్మాయిలను పంపిస్తుందంటూ ఒక జూనియర్ ఆర్టిస్ట్ వాపోయ్యింది. అంతే కాదు మహిళా సంఘం నేత సంధ్య కూడా అదే ఆరోపణలు చేశారు.

ఆమె చేసిన ఆరోపణలకు జీవితా రాజశేఖర్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు "మహిళా సంఘాల నేతల మాటలను జీవిత ఖండించారు.  మహిళా సంఘాల నేతల పై ఫైర్ అయిన జీవిత, ఏ ఆధారాలతో నాపై ఆరోపణలు చేశారో చెప్పాలంట డిమాండ్ చేసింది. నాపై నా కుటుంబంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చానెళ్ల పై నేను కేసు పెడతానంది.  నాపై చేసిన అసత్య ఆరోపణలు నిరూపించాలి. ఛానల్ పై మహిళా సంఘాల నేత సంధ్య పై  కేసు పెట్టడమే కాదు పరువు నష్టం దావా కూడా వేస్తానంటు ధ్వజమెత్తారు.

loader