కరోన ప్రభావంతో అన్ని రంగాలు కుదేళవుతున్నాయి. ముఖ్యంగా వినోద పరిశ్రమ మీద ఈ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు మూతపడటంతో అదే జీవనోపాదిగా కలిగిన చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో చాలా మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, ఇతర టెక్నికల్‌ డిపార్టఎమెంట్ వారు చిన్న చిన్నపనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటారు.

హిందీ సినిమాల్లో కనిపించే నటుడు జావెద్ హైదర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన గులామ్‌, లైఫ్‌ ఐసీకి తైసీ సినిమాలో నటించిన జావెద్‌ హైదర్‌ అవకాశాలు లేక కూరగాయలు అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు. నటి డోలి బింద్రా , జావెద్‌ కూరగాయలు అమ్ముతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఆ వీడియోలో జావెద్‌ దునియా మే రెహనా హై పాటకు లిప్‌ సింగ్ చేస్తూ కనిపించాడు. జావెద్‌ తాను కూరగాయల వ్యాపారం చేస్తూ టిక్‌ టాక్‌ వీడియోస్ చేశాడు, ఆ వీడియోనే డోలి షేర్ చేసింది. జావెద్‌కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. 97 వేల మందికి పైగా ఫాలోవర్స్‌ తో పాటు 15 లక్షలకు పైగా లైక్స్‌ జావెద్‌ టిక్‌ టాక్‌ వీడియోలకు వచ్చాయి. బాల నటుడిగానే కెరీర్‌ ప్రారంభించి జావెద్‌ దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్నాడు.