సెలబ్రెటీ హోదాలో ఉన్నప్పుడు ఏమి చేయకుంటేనే రూమర్స్ క్రియేట్ అవుతాయి అనే విషయంలో నిజం ఉంది. కానీ పొరపాటున ఏ మాత్రం నోరు జారీ అనరాని మాటలు అంటే వారికి దిమ్మ తిరగడం కాయం. అప్పుడు అసలైన రూమర్స్ వస్తాయి. ఫైనల్ గా ఆ మాట ఎందుకు అన్నానో అని తలపట్టుకుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఓ కన్నడ యువ హీరో సతమతమవుతున్నాడు. అతను ఎవరో కాదు. రీసెంట్ గా టగరు అనే సినిమాతో విజయం అందుకున్న ధనంజయ్. 

సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ లను బాగానే నిర్వహించింది. ఇంటర్వ్యూలు కూడా బాగానే ఇచ్చాడు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ యువ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా కన్నడ అభిమానులు సైతం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే రొమాంటికి సన్నివేశాల్లో నటించే అవకాశం వస్తే.. ఎవరికి ముందు ఒకే చెబుతారు అని అడిగిన ప్రశ్నకు ధనంజయ్ ఘాటైన సమాధానం ఇచ్చాడు. 

లిప్ లాక్ లాంటి సీన్స్ లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేతో నటించాలని కోరికగా ఉండనీ ఆ ఒక్క ఛాన్స్ వస్తే చాలని చెప్పాడు. దీంతో మొన్నటి వరకు పొగిడిన అభిమానులే ఇప్పుడు ధనంజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టగరు సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 10 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసి మంచి లాభాలను అందించింది.