Asianet News TeluguAsianet News Telugu

మనం మనం ఒకే కులం.. ఆఫర్ చూపించరాదే, నెటిజన్ కి బ్రహ్మజీ స్ట్రాంగ్ కౌంటర్!

ఓ సినిమా ఔత్సాహికుడు నటుడు బ్రహ్మాజీకి డైరెక్ట్ ప్రపోజల్ పెట్టాడు. మనిద్దరిదీ ఒకే క్యాస్ట్ కాబట్టి, నాకు సినిమా అవకాశం ఇప్పించాలని డిమాండ్ చేశాడు. సదరు నెటిజన్ సోషల్ మీడియా డిమాండ్ కి బ్రహ్మాజీ తనదైన శైలిలో స్పందించారు.

actor brahmaji strong reply to netizen it goes viral ksr
Author
Hyderabad, First Published Jul 22, 2021, 1:12 PM IST


ఉద్యోగం, పదవి, పని... ఇలా ప్రయోజనం ఏదైనా సొసైటీలో క్యాస్ట్ ఫీలింగ్ బేస్ మీద జరుగుతాయనే నమ్మకంగా జనాల్లో గట్టిగా ఉంది. ఇక అత్యంత ప్రభావవంతమైన సినిమా, పాలిటిక్స్ లో ఈ జాడ్యం మరీ ఎక్కువ. పైకి అదేమీ లేదని చెప్పుకునే పెద్ద మనుషులు, ప్రాక్టికల్ గా ఇదే ఫాలో అవుతారు. గ్రౌండ్ లెవెల్ లో అధ్యయనం చేసినప్పుడు ఈ విషయాలు బయటపడతాయి. 


ఈ సూత్రాన్ని గట్టిగా నమ్మిన ఓ సినిమా ఔత్సాహికుడు నటుడు బ్రహ్మాజీకి డైరెక్ట్ ప్రపోజల్ పెట్టాడు. మనిద్దరిదీ ఒకే క్యాస్ట్ కాబట్టి, నాకు సినిమా అవకాశం ఇప్పించాలని డిమాండ్ చేశాడు. సదరు నెటిజన్ సోషల్ మీడియా డిమాండ్ కి బ్రహ్మాజీ తనదైన శైలిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే 'అన్నా.. నేను మన కమ్యూనిటీకి చెందినవాడిని. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరుపున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించగలరు అని మిక్కిలి కోరుకుంటున్నాను' అంటూ ప్రపోజల్ పెట్టాడు. 

సదరు నెటిజన్ తీరుకు బ్రహ్మాజీ ఒకింత ఆవేశానికి గురయ్యారు. అయినప్పటికీ సావధానంగా తనదైన స్టైల్‌లో నెటిజన్‌ రిప్లై ఇచ్చాడు. 'నేను ఇండియన్‌ని.. తెలుగోడిని.. అదే నా కమ్యూనిటీ' అని పేర్కొన్నాడు. బ్రహ్మాజీ రిప్లై కి నెటిజెన్స్ ఫిదా కావడంతో పాటు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో సదరు నెటిజన్ ని గట్టిగా తిట్టిపోశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios