టాలీవుడ్ లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు బ్రహ్మాజీ. ఇటీవల విడుదలైన 'అరవింద సమేత' సినిమాలో కూడా మంచి పాత్రలో నటించి మెప్పించాడు. అయితే తాను 365 రోజులు మెడిసిన్ తీసుకుంటూనే ఉన్నానని వెల్లడించాడు బ్రహ్మాజీ..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతడు తన అభిమానులకి, సహ నటుల ట్వీట్స్ కి ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటాడు. తాజాగా ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా బ్రహ్మాజీని ఓ ప్రశ్న అడిగాడు. 'బ్రహ్మాజీ గారు మీరు తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారు. మీరేదో మెడిసిన్ వాడుతున్నారనిపిస్తోంది. లేకపోతే ఇరవై ఏళ్లుగా ఒకే లుక్ ని మీరు ఎలా మైంటైన్ చేయగలరు?' అంటూ ప్రశ్నించాడు.

దీనికి స్పందించిన బ్రహ్మాజీ తాను మెడిసిన్ వాడుతున్న మాట నిజమేనని ఒప్పుకున్నాడు. ''నువ్వు చెప్పింది నిజమే.. యోగా, మెడిటేషన్, ధ్యానం, ఎనిమిది గంటల నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, సంతోషంగా ఉండడం, క్రమశిక్షణతో ఉండటం అనే మెడిసిన్ ని నేను ఏడాది మొత్తం తీసుకుంటాను'' అంటూ వెల్లడించాడు.