ఆ హీరోయిన్ గట్టిగా కౌగిలించుకోమని చెప్పింది!

actor arjun comments on rai lakshmi
Highlights

అర్జున్ తనను రాయ్ లక్ష్మి గట్టిగా కౌగిలించుకోమని చెప్పిందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు

ఎక్స్ వీడియోస్ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించి గుర్తింపు పొందిన నటుడు అర్జున్ తనను రాయ్ లక్ష్మి గట్టిగా కౌగిలించుకోమని చెప్పిందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయంలోకి వస్తే.. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన బెంగుళూర్ డేస్ సినిమాలో అర్జున్ కి నటించే ఛాన్స్ లభించింది. అందులో ఆర్య, బాబీసింహాలతో పాటు అర్జున్ కి కూడా చోటు దక్కింది.

షూటింగ్ లో భాగంగా అర్జున్ పాత్ర రాయ్ లక్ష్మీ ను కౌగిలించుకోవాలి. అర్జున్ కు సిగ్గు చాలా ఎక్కువట. దీంతో అతడికి ఆ సన్నివేశంలో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించడంతో.. రాయ్ లక్ష్మీ ధైర్యం చెప్పి గట్టిగా కౌగిలించుకో అని చెప్పిందట. ఈ విషయాన్ని వెల్లడించిన అర్జున్ సినిమాలో బాబీ సింహాతో ఫైట్ చేసే సన్నివేశంలో నటించడం కూడా చాలా కష్టంగా అనిపించిందని దానికోసం చాలా టేక్స్ తీసుకున్నట్లు వెల్లడించారు.

నిజానికి అర్జున్ సినిమా రంగప్రవేశం వింతగా జరిగిందట. అతడికి బిడియం కాస్త ఎక్కువగా ఉండడంతో స్నేహితులు కెమెరా ముందు నటిస్తే సిగ్గు కాస్త అయినా తగ్గుతుందని మోడలింగ్ రంగంలోకి పంపినట్లు ఆ తరువాత విష్ణు అనే స్నేహితుడి ద్వారా పుగళ్ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని అలా సినిమాలలో రాణిస్తున్నానని అన్నారు. 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader