Asianet News TeluguAsianet News Telugu

ఎగ్జిబిటర్లకి యాక్టీవ్‌ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కౌంటర్‌.. హీరోలను టార్గెట్‌ చేయడంపై ఫైర్‌

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సినిమా థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20న సమావేశమైంది. ఈ సమావేశంలో కొందరు చేసిన విమర్శలపై ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది ప్రొడ్యూసర్స్ గిల్డ్. 

active telugu film producers guild counter to exhibitors on movie releases
Author
Hyderabad, First Published Aug 23, 2021, 4:48 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదల లొల్లి చర్చనీయాంశంగా మారింది. కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల విడుదల చేస్తున్నారు. మరికొందరు థియేటర్‌లోకి వెళ్తున్నారు. అయితే ఓటీటీలో విడుదల చేస్తున్న సినిమాలపై ఎగ్జిబిటర్లు ఫైర్‌ అవుతున్నారు. హీరోలకు స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చింది థియేటర్లే అని, దాన్ని కాదని ఓటీటీకి వెళ్లడంపై వారు అసంతృప్తి చెందుతున్నారు. మరికొన్ని రోజులు వేచి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

అయితే ఇటీవల నాని హీరోగా నటించిన `టక్‌ జగదీష్‌` చిత్రాన్ని సెప్టెంబర్‌ 10న ఓటీటీలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. నాని సైతం నిర్మాతల ఇష్టానికి వదిలేశారు. ఈ మేరకు ఆయనో నోట్‌ని పంచుకున్నారు. తప్పని పరిస్థితుల్లో ఓటీటీలోకి వెళ్లామనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు. అయితే దీనిపై ఎగ్జిబిటర్లు చేసిన కామెంట్లు వివాదంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా యాక్టీవ్‌ తెలుగు నిర్మాతల మండలి గిల్డ్ స్పందించింది. సినిమాని ఎక్కడ ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్మాతల ఇష్టమన్నారు. 

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సినిమా థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20న సమావేశమైంది. ఈ సమావేశంలో కొందరు చేసిన విమర్శలపై ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది ప్రొడ్యూసర్స్ గిల్డ్. ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు స్పందించిన తీరుతో తెలుగు సినిమా నిర్మాతలు తీవ్రంగా కలత చెందినట్టు చెప్పారు. థియేటర్ యజమానులకు కౌంటర్‌ ఇచ్చారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు విడుదల చేసిన నోట్‌లో చెబుతూ, సినిమా అనేది మొదలయ్యేది నిర్మాత వల్లనే, ఎక్కడ, ఎప్పుడు రిలీజ్ చేయాలో, ఎవరికి అమ్మాలో అది నిర్మాత ఇష్టం. బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదు. నిర్మాతలకు సహాయపడేలా విధంగా ఎగ్జిబిటర్స్ ఉండాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశాము. కానీ వారు పెద్ద సినిమాలకు, డిమాండ్ వున్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న సినిమా లపై వారు ఎటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ లు అందరూ కలసి ఉంటేనే సినీ పరిశ్రమ బాగుంటుంది. ప్రస్తుత సమస్యల పై అందరూ కలిసి చర్చించు కొని పరిష్కారాలు ఆలోచించుకోవాల`ని  ప్రొడ్యూసర్స్ గిల్డ్ తెలిపింది.

`ఓటీటీ మాధ్యమంలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదు. ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం అనిపించుకోదు. తన చిత్రంపై సర్వహక్కులు నిర్మాతకు చెందుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మార్కెట్‌ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. అందువల్లే, పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ఒక హీరోను ఎవరైనా టార్గెట్‌ చేయడం ద్వారా పరిశ్రమలోని ఆరోగ్యకర, స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీస్తుంది. నిర్మాతలు/హీరోలు/సాంకేతిక నిపుణులు ఎవరైనా ఒంటరి కాకూడదు. ఏ సెక్టార్‌ చేత వెలివేయబడకూడదు.

పరిశ్రమ పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, వివిధ వ్యాపార భాగాస్వాములు. పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడిన పరిశ్రమ మనది. వ్యక్తిగతంగా, పరిశ్రమగా మనమంతా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాం. అన్ని సెక్టార్లు కష్టకాలంలో ఉన్నాయని మేం అర్థం చేసుకున్నాం. వారితో పాటు మేం బాధపడుతున్నాం. పరస్పర మద్దతు ఆశిస్తున్నాం. గతంలో మనం ఎదుర్కొన్న సమస్యలకు అందరం కలసికట్టుగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని మేం భావిస్తున్నాం.తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మనమంతా సమష్టిగా పని చేయాలి` అని యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios