అప్పట్లో స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ అర్జున్ , విషాదాంతమే
పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే అర్జున్ కు భార్యా,, పిల్లలు ఉన్నారు. అయితే ఆయన జీవితంలో ఓ ప్రేమ కథ ఉందని రీసెంట్ గా బయిటకు వచ్చింది.
సినిమాల్లో ఉన్నట్లు ప్రతీ ప్రేమ కథా చివరకు హ్యాపీ ఎండింగ్ తో ముగియదు. కొన్ని వన్ సైడ్ లవ్ లుగా మిగిలిపోతాయి. అప్పట్లో తమిళంలో మురళి , హీరా కాంబినేషన్ లో హృదయం అనే సినిమా వచ్చి సూపర్ హిట్టైంది. అందులో సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా హీరో తన ప్రేమను తన మనస్సులోనే ఉంచుకుంటాడు. చివరికి క్లైమాక్స్ లో ఆ విషయం రివీల్ చేస్తాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ది అలాంటి లవ్ స్టోరీనే . అయితే ఇక్కడ చివరకు ఎక్కడా రివీల్ చేయలేదు. ఇంతకీ యాక్షన్ కింగ్ అర్జున్ ప్రేమించింది అంటే తనతో పనిచేసిన కో స్టార్ ని. ఎవరామె..అసలు ఆ ప్రేమ కథ ఎందుకు సఫలం కాలేదో చూద్దాం.
సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తనదైన యాక్షన్ సినిమాలతో యాక్షన్ కింగ్ అనే బిరుదు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ స్టార్ ఎవరూ అంటే అర్జున్. కన్నడనాట జన్మించిన అర్జున్…తమిళ,తెలుగులో హీరోగా రాణించారు. ఓ టైమ్ లో తెలుగులో వరస సినిమాలతో దూసుకుపోయాడు. ‘మన్నెంలో మొనగాడు’, మా పల్లెలో గోపాలు ‘హనుమాన్ జంక్షన్, ’త్రిమూర్తులు’, శ్రీ ఆంజనేయం’ వంటి డైరెక్ట్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.మరోవైపు దక్షిణాదిన ఉన్న కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కొన్ని సినిమాల్లో హీరోగా మెప్పించిన ఘనత అర్జున్‌ది.
యాక్షన్ కింగ్ అర్జున్ ని ప్రేమలో ముంచిన హీరోయిన్ ఎవరూ అంటే..
ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కేవలం నటనలోనే కాదు…నిర్మాతగా, దర్శకుడిగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన కంటూ కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు ఇచ్చారు. అర్జున్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరుశ్రీనివాస సర్జ. కానీ ఈయన సినిమాల్లో తన పేరును అర్జున్‌గా మార్చుకున్నారు. ప్రఖ్యాత కన్నడ నటుడు శక్తి ప్రసాద్ కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన అర్జున్…ఆ తర్వాత హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు. 1973లో బ్రూస్లీ ప్రధాన పాత్రలో రిలీజైన ‘ఎంటర్ ది డ్రాగన్’ స్పూర్తితో మార్షల్ ఆర్ట్స్‌లో మంచి పట్టు సాధించారు. అదే అర్జున్‌కు దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్షన్ కింగ్‌గా సెపరేట్ గుర్తింపు తీసుకొచ్చింది. అంతేకాదు దక్షిణాదిలో చాలా మంది హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేసారు. ఇక పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే భార్యా, పిల్లలు ఉన్నారు. అయితే ఆయన జీవితంలో ఓ ప్రేమ కథ ఉందని రీసెంట్ గా బయిటకు వచ్చింది.
అప్పటికే అనేక కన్నడ సినిమాలు చూసిన అర్జున్ సర్జా 'నంద్రి'తో తమిళంలోకి అడుగుపెట్టారు. 1984లో రామనారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్, నళిని, మహాలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత కడమై, ఇలమై, వేషం, ఎంగిల్ కురల్ వంటి అనేక చిత్రాల్లో తమిళంలో హీరోగా నటించారు.ఓ రకంగా ఆ సినిమా తమిళంలో అర్జున్ కు లైఫ్ ఇచ్చింది. ఈ క్రమంలో నళినితో మూడు తమిళ సినిమాలు చేసారు. అప్పుడే నళినితో అర్జున్ ప్రేమలో పడ్డారు. ఆమె అందం, అమాయకత్వం అర్జున్ ని ఆమెతో ప్రేమలో పడేసాలా చేసాయి. అయితే తన ప్రేమను చెప్దామనుకునేసరికి ఓ ఈ ప్రేమ కథలో ఓ మెలిక వచ్చింది.
అర్జున్ వన్ సైడ్ ప్రేమ కథ
నళిని అప్పటికే నళిని ప్రముఖ దర్శకుడు, నటుడు రామరాజన్‌తో ప్రేమలో ఉందని అర్జున్‌కి తెలిసింది. దాంతో ముందుకు వెళ్లలేకపోయాడు. తనే చాలా బాధ పడ్డాడు. అర్జున్ తన ప్రేమను నళినికి చెప్పకుండా చివరి వరకు తన మనసులో అలా సమాధి చేసేసారు. నళిని పెళ్లి సమయంలో ఈ విషయం సినీ వర్గాల్లో చాలా చర్చనీయాంశమైంది. నంద్రీలో నటిస్తున్నప్పుడు నళినితో అర్జున్‌కి మంచి అనుబంధం ఏర్పడినా.. యార్‌లో నటిస్తున్నప్పుడు అది ప్రేమగా మారిందని అంటున్నారు. ఈ సినిమాలో నళినితో చాలా సన్నిహిత సన్నివేశాల్లో అర్జున్ నటించటమే అందుకు కారణం అంటారు.
ఎవరీ నళిని, అర్జున్ ఆమెతో ఎలా ప్రేమలో పడ్డారు
ఇక నళిని ఎవరూ అంటే...ఆమె చెన్నైకి చెందినవారు. అతని తండ్రి డ్యాన్స్ మాస్టర్. తల్లి డ్యాన్సర్ కావడంతో సినిమాల్లో నటించే అవకాశం ఈజీగా వచ్చింది. అలా 1980లో 14 ఏళ్ల వయసులో 'ఒతయాడి పాటైలే' సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రణువ వీరన్, ఓం శక్తి, ఉయిర్ ఉల్లావరై ఉష, శరణాలయం, మనైవి సొల్లె మంత్రం వంటి అనేక చిత్రాల్లో నటించారు. రజనీ, కమల్, విజయకాంత్ వంటి ఎందరో స్టార్ హీరోలతో నళిని నటించింది. 1986లో ఒకే ఏడాదిలో 11 తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించడం విశేషం.
రామరాజన్‌ను ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న నళిని 1988 నాటికి పూర్తిగా సినిమా రంగానికి దూరమైంది. ఆ తర్వాత 2000లో నటుడు రామరాజన్‌తో విడాకులు తీసుకున్న నళిని, 2002లో శింబు నటించిన 'కాదల్' చిత్రంలో షర్మి తల్లి గా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం వెండితెర, బుల్లితెరపై మంచి పాత్రలలో కనిపిస్తున్నారు.
అర్జున్ సజ్జ భార్య, పిల్లలు
అర్జున్ విషయానికి వస్తే ...నిళని తో వన్ వే ప్రేమ వ్యవహారం తరువాత 1988 లో నివేదితతో ప్రేమలో పడి, వివాహం చేసుకున్నాడు. నివేదిత రథ సప్తమి, అగ్నిపర్వ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు శ్రీ రామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ద్వారా తన భర్త అర్జున్ సర్జాతో కలిసి 10కి పైగా సినిమాల్లో నటించింది. అర్జున్ సర్జా 62 ఏళ్ల వయసులో కూడా హీరోగా కనిపిస్తున్నా ఈరోజుల్లో హీరో పాత్రలు రావడం లేదు. అందుకే విలన్‌గా నటిస్తున్నాడు.
ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తోన్నాడు అర్జున. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో గత ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ లియోలో హెరాల్డ్ దాస్ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో అర్జున్ కనిపించాడు. ప్రస్తుతం అజయ్ విదా ముయార్చిలో అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.హీరోగా విలన్‌గా చేస్తున్న అర్జున్ కెరీర్ మొదటి నుంచి ఒకే తరహా బాడీ మెయింటెన్ చేయడం విశేషం. ఫిల్మ్ కెరీర్‌లో 150 సినిమాల మైలురాయిని అందుకున్న ఈ ఒకేఒక్కడు