టాలీవుడ్ లో ఇప్పుడు లక్కీ చార్మ్ ఎవరంటే రష్మిక మందాన అనాలి.  ఫీచర్స్ పరంగా హీరోయిన్ రేంజ్ కాకపోయినా, లక్కీ హీరోయిన్ గా ముద్ర పడడంతో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ ఏడాది ఆమె నటించిన రెండు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మహేష్ హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు  సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. ఇక కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్ భీష్మ చిత్రంలో హిట్ అందుకున్నారు. ఆ మూవీ హీరోయిన్ కూడా రష్మిక కావడం విశేషం. 

అదృష్టం, అభినయం కలిగిన ఈ అమ్మడి కెరీర్ జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది. ఇక సుకుమార్-బన్నీల హ్యాట్రిక్ మూవీ పుష్ప చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. ఐతే ఈ హీరోయిన్ సీనియర్ నటుడు బ్రహ్మజీని ట్విట్టర్ ల్  ఫాలో అవుతుందట. దీనికి  సదరు నటుడు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. ఓ మై గాడ్ నా ఫేవరేట్ హీరోయిన్ నన్ను ఫాలో అవుతుందని ట్విట్టర్ వేదికగా తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. 30ఏళ్లకు పైగా పరిశ్రలో ఉన్న బ్రహ్మాజీ రష్మీక ఫాలో అవడానికి అంత సంతోషానికి గురయ్యాడంటే చెప్పుకోదగ్గ విషయమే మరి. 

రష్మిక నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలలో బ్రహ్మాజీ నటించడం జరిగింది.  ఆ చిత్ర షూటింగ్స్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరిందని సమాచారం. ప్రస్తుతం బ్రహ్మాజీ టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరు. కమెడియన్ మరియు విలన్ పాత్రలు కూడా ఆయన చేస్తున్నారు. ఏడాదికి పదికి పైగా సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక బ్రహ్మజీ కుమారుడు సంజయ్ రావ్ కూడా ఓ పిట్ట కథ చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు.