'ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు' అని రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. పురాతన దేవాలయంలో జరుగుతున్న దైవ కార్యాన్ని నాశనం చేసే రౌడీ మూకలపై పంజా విసిరిన చిరంజీవి లుక్ కట్టిపడేసింది.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, రామ్ చరణ్ కీలక రోల్ చేస్తున్నారు. నేడు ఆచార్య మూవీ టీజర్ విడుదల చేశారు చిత్రం బృందం. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో సాగిన ఆచార్య టీజర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అంశాలతో సాగింది. కత్తి పట్టుకొని శత్రువులను చెండాడుతున్న చిరంజీవి లుక్ ఫెరోషియస్ గా ఉంది.
'ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు' అని రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. పురాతన దేవాలయంలో జరుగుతున్న దైవ కార్యాన్ని నాశనం చేసే రౌడీ మూకలపై పంజా విసిరిన చిరంజీవి లుక్ కట్టిపడేసింది. టీజర్ చివర్లో 'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఆచార్య అంటూ ఉంటారు... బహుశా గుణపాఠాలు చెబుతూ ఉంటాననేమో' అని చెప్పిన చిరు డైలాగ్ టీజర్ కే హైలెట్ గా ఉంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆచార్య నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పురాతన వారసత్వ సంపద, సంస్కృతి అనే సామాజిక అంశానికి కమర్షియల్ హంగులు జోడించి, కొరటాల ఆచార్య తెరకెక్కిస్తున్నారని సమాచారం. సమ్మర్ కానుకగా ఆచార్య విడుదల కానుంది.
