Acharya: నాలుగు రోజులకే ఆచార్య అవుట్... వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు షాక్!


తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఆచార్య రన్ ముగిసినట్లే. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. మొత్తంగా చిరంజీవి కెరీర్ లో ఆచార్య డిజాస్టర్ గా మిగిలిపోయింది. 

acharya run ends in theaters huge losses for distributors


లెజెండరీ స్టార్ ఒకవైపు.. వేయి కోట్ల హీరో మరొక వైపు.. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు. ఈ కాంబినేషన్ వింటే చాలు జనాలు థియేటర్స్ కి పోటెత్తాలి. మరి దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా! ఆచార్య (Acharya)మూవీ విషయంలో అదే జరిగింది. నాలుగో రోజుకే ఆచార్య థియేటర్స్ నుండి వెళ్ళిపోతుంది. చిరంజీవి కెరీర్ లోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఆచార్య ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమను ఏలుతున్న చిరంజీవి(Chiranjeevi) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చి కూడా ఇండస్ట్రీ రికార్డు సెట్ చేసిన ఘనత ఆయన సొంతం. ఆచార్య విషయంలో మాత్రం అవేమీ పని చేయడం లేదు. ఆ సినిమా ఆడుతున్న థియేటర్స్ వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. రెండో రోజే ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో ఆచార్య థియేటర్స్ ఆర్ ఆర్ ఆర్(RRR Movie), కెజిఎఫ్ 2 చిత్రాలకు మళ్లించేశారు. రెండో రోజు ఆచార్య షేర్ సింగిల్ డిజిట్ కి పడిపోగా... మూడో రోజు కోటి, నాలుగో రోజుకు లక్షల్లోకి వచ్చేసింది. ఎంత నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ రేంజ్ డిజాస్టర్ ఊహించనిదే. 

ఈ జనరేషన్ లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్స్ మాత్రమే ఈ తరహా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలను చూసే వాడు లేక చివరికి ఉచిత ప్రదర్శన బోర్డులు థియేటర్స్ వద్ద తగిలించారు. ఆచార్య పరిస్థితి కొంచెం అటూ ఇటుగా అలానే ఉంది.ప్రేక్షకులు రాక షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. వీకెండ్ ముగియకుండానే షోలు క్యాన్సిల్ కావడం దారుణమైన పరిణామం. దాదాపు రూ. 150 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆచార్య నాలుగు రోజులకు కేవలం రూ. 44.5 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. రంజాన్ సెలవు దినం కొంచెం ఆచార్యకు ఊపిరిపోసే అవకాశం కలదు. మొత్తంగా ఆచార్య రన్ థియేటర్స్ లో ముగిసింది. వంద కోట్లకు పైగా నష్టాన్ని ఈ చిత్రం మిగిల్చింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios