మెగా అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా వారికి ఓ సర్ప్రైజ్  సిద్ధమైంది. ఆచార్య మూవీ నుండి దర్శకుడు కొరటాల శివ క్రేజీ అప్డేట్ సిద్ధం చేశారు. ఆగష్టు 22న చిరంజీవి తన 65వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోనున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకల కోసం ఆయన అభిమానులు భారీ ఏర్పాట్లతో సిద్ధం అవుతున్నారు. ఐతే గతంలో మాదిరి సామాజిక సేవా కార్యక్రమాలు కరోనా కారణంగా రద్దు కానున్నాయి.  కానీ సోషల్ మీడియాలో భారీ సందడి నెలకొననుంది. 

ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదల కానున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఆగస్టు 22 సాయంత్రం 4:00 గంటలకు ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల కానున్నాయి. దర్శకుడు కొరటాల శివ సోషల్ కాన్సెప్ట్ తో కూడిన కమర్షియల్ సబ్జెక్టు గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విప్లవ భావాలు కలిగిన సామాజికవాదిగా చిరంజీవి పాత్ర ఉండనుంది. దీనితో ఆచార్య మూవీలో చిరంజీవి లుక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల చిరంజీవితో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇక ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం చరణ్ ని ఎంచుకోవడం జరిగింది. ఐతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేటు కావడంతో చరణ్ ఆచార్య మూవీలో నటించే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. చరణ్ చేయని పక్షంలో మహేష్ ఈ పాత్ర చేసే అవకాశం కలదు. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ  చిత్రాన్ని నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.