Asianet News TeluguAsianet News Telugu

Chiranjeevi: 'ఆచార్య' పాఠం..ఇక నుంచి ఆ విషయాల్లో చిరు వేలెట్టరు?

చిరంజీవి జోక్యం ఎక్కువ అవటం...కొరటాల వంటి రైటర్ కు కూడా ఫ్రీడమ్ ఇవ్వకపోవటంతోనే ఈ సమస్య వచ్చిందని అన్నారు. చిరు దగ్గరకు ఈ మాటలు చేరాయంటున్నారు. 

Acharya movie big lessen to Chiranjeevi
Author
Hyderabad, First Published May 21, 2022, 10:41 AM IST


 మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన తొలి సినిమా 'ఆచార్య'. తండ్రి కొడుకు కలిసి ఎలా చేశారనే ఆసక్తికి‌ తోడు 'ఆర్ఆర్ఆర్' సక్సెస్  తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఉత్తరాది ప్రేక్షకులు సైతం 'ఆచార్య' కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఈ ప్రభావం రామ్ చరణ్ పై పెద్దగా లేదు కానీ,  కొరటాల శివ పైనా, చిరంజీవి మీదా పడింది. 

ముఖ్యంగా ఆచార్య చిరు కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్ కావటంతో అసలు ఎందికిలా ప్లాఫ్ అయ్యిందనే పోస్ట్ మార్టమ్ మొదలైపోయింది. ఖచ్చితంగా చిరు టీమ్ లోనూ ఇదే జరిగే ఉంటుంది. చిరంజీవి జోక్యం ఎక్కువ అవటం...కొరటాల వంటి రైటర్ కు కూడా ఫ్రీడమ్ ఇవ్వకపోవటంతోనే ఈ సమస్య వచ్చిందని అన్నారు. చిరు దగ్గరకు ఈ మాటలు చేరాయంటున్నారు. అందుకే ఇక నుంచి తన సినిమాల విషయంలో తన సలహాలు,సూచనలు ఇవ్వటం తగ్గించాలని నిర్ణయించుకున్నారట.  

 త‌ను అతిగా జోక్యం చేసుకున్నాననే మాట రాకూడదని భావిస్తున్నారట.  అదే సమయంలో  ద‌ర్శ‌కుడికి కావ‌ల్సినంత ఫ్రీడ‌మ్ ఇవ్వ‌ాలని ఫిక్స్ అయ్యారట. ఆచార్య చిరంజీవికు ఈ పాఠం నేర్పిందని అంటున్నారు.  త‌న త‌దుప‌రి సినిమాల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని భావిస్తున్నారు. ద‌ర్శ‌కుల‌కు కావ‌ల్సినంత స్వేచ్ఛ ఇచ్చి, త‌న జోక్యం పూర్తిగా త‌గ్గించేయాల‌న్న నిర్ణ‌యానికి చిరు వ‌చ్చార‌ని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఆచార్య విషయానికి వస్తే... చిరంజీవి సినిమా అంటే అభిమానులు, ప్రేక్షకులు మెగా మూమెంట్స్ ఆశిస్తారు.  అవేమీ ఇందులో లేవు. దానికి తోడు దర్శకుడు కొరటాల శివ ఇప్పటివరకు తీసిన చిత్రాలు అన్నిసక్సెస్  సాధించాయి. ఆయనది ప్రత్యేక స్టైల్.‌  కమర్షియల్  హంగులతో,  ఎంటర్టైన్మెంట్ తో కూడిన మెసేజ్  చిత్రాలు తీశారు. మెగా ఇమేజ్ కు కొరటాల శివ కథ, దర్శకత్వం తోడైతే... భారీ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సినిమా ఎలా ఉందా? అంటే... కొంచెము కూడా లేదని చెప్పాలి. భారీ బ్లాక్ బస్టర్ కాదు... కనీసం కామన్ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయ్యింది.

ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. మరోవైపు మెహ‌ర్ ర‌మేష్ సినిమా కూడా ఉంది. ఈ సినిమాల క‌థ, టేకింగ్ విష‌యంలో  చిరు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ద‌ర్శ‌కుల‌కు ఫ్రీడ‌మ్ ఇచ్చేశార‌ని  స‌మాచారం. ఆచార్య రిజల్ట్ తో  చిరులో వ‌చ్చిన పెద్ద మార్పు ఇది అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios