వరుణ్‌ తేజ్‌  ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్న చిత్రం‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్‌’.‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో...  లావణ్యా త్రిపాఠి, అదితీరావ్‌ హైదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. 

షూటింగ్‌ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది..కధా నేపధ్యం ఏమిటి అనే విషయాలు సినీ లవర్స్ మధ్య చర్చనీయాంసంగా మారాయి. 

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కథ ..శ్రీహరి కోట,నెల్లూరు బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. కథలో మేజర్ పార్ట్ అవుటర్ స్పేస్ లో జరుగుతుంది. వరుణ్, అదితి అతని టీమ్ కలిసి ఓ మిషన్ మీద స్పేస్ కు వెళ్తారు. ఆ క్రమంలో వచ్చే సమస్యలు...వాటిని వాళ్లు పరిష్కరించుకున్నారనేది కీలకమైన డ్రామా గా సినిమా నడవనుంది.

రీసెంట్ గా  రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌లకు మంచి స్పందన లభిస్తోంది. సినిమాను డిసెంబర్‌ 21న విడుదల చేయాలను కుంటోంది టీమ్.  ఆల్రెడీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం సెకండాఫ్‌ ఎడిటింగ్‌ కూడా కంప్లీట్‌ అయ్యిందని  సినీ వర్గాల సమాచారం. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తున్నారు.