ఈ మధ్యకాలంలో రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందీ అంటే అదే  ‘ఉప్పెన’.  క‌రోనాతో గ‌తేడాది నుంచి వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. లాక్‌డౌన్ త‌ర్వాత ఎదురు చూసేలా చేయించిన చిత్రాల్లో ఇదీ ఒకటి.   చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణవ్‌తేజ్  హీరోగా పరిచ‌యమవుతున్న చిత్రం కావడం...  సుకుమార్ రైటింగ్స్‌లో సిద్ధమైన ప్రేమ‌క‌థ కావ‌డంతో ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ మ‌రింత‌గా పెరిగాయి.ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ..కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి.

 ఈ వీకెండ్ దుమ్ము రేపేలా బుక్కింగ్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి విడుదల అనేది చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొత్త సినిమాలు కూడా నెలలోపలే ఓటీటి వచ్సేస్తున్నాయి కదా..అలా సంక్రాంతి సినిమాలు ఓటీటిలో వచ్చేసాయి కాబట్టి ఈ సినిమా కూడా ఓటీటి రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. కానీ ఎదురుచూపులకు బ్రేక్ పడుతోంది. ఈ సినిమా మినిమం రెండు నెలల తర్వాతే ఓటీటి బాట పట్టనుంది.  

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ కు ముందుగానే ఈ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం.. థియేటర్లో విడుదలైన 60 రోజుల తర్వాతే ఈ చిత్రాన్ని నెట్ ప్లిక్స్ స్టీమింగ్ చేయాల్సి ఉంది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఏప్రిల్ 11 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. 

వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత వచ్చిన తొలి క్రేజీ సినిమా ఇదే. పైగా ముందు నుంచి కూడా అంతా అద్భుతం అంటూ ప్రమోట్ చేసుకోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. దాంతో 10 కోట్లకు పైగా షేర్ వచ్చింది తొలిరోజు.  20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సేఫ్ జోన్ కు వచ్చేలా కనిపిస్తుంది. 
 
 ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దాంతో ఉప్పెన సినిమా పై  మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకులందరు సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు. మొదటి రోజే కలెక్షన్స్ దుమ్ము రేపిన ఈ సినిమా రాబోయే రోజుల్లో.. ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.