Asianet News TeluguAsianet News Telugu

Akhanda:'అఖండ' సోమవారం టెస్ట్ పాసైందా? షాకింగ్ నిజం

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత అత్యధిక మంది ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చిన చిత్రంగా నిలిచింది ‘అఖండ’. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ ఇదే హవా కొనసాగిస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమిది. 

About the Akhanda performance on Monday
Author
Hyderabad, First Published Dec 7, 2021, 8:16 AM IST

 ‘‘ధం ధం ధర్మభేరి శబ్ధం చెయ్యమంది యుద్ధం దేనికైనా సిద్ధం...’’ అంటూ బాలకృష్ణ(Balakrishna) ‘అఖండ’(Akhanda) గర్జన తో ఫ్యాన్స్ ఓ ప్రక్క ఊగిపోతున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత ఆ కలయికలో రూపొందిన చిత్రమిది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన Akhanda సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది. ఫస్ట్ వీకెండ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవటంతో అసలు టెస్ట్ సోమవారం మొదలవుతుందని సినిమా వాళ్లు  మీడియా మొత్తం ఎదురుచూసింది. ఇంతకీ సోమవారం టెస్ట్ అఖండ పాసైందా లేదా?

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా సోమవారం టెస్ట్ లో డిస్ట్రిక్షన్ లో పాసైంది. దాదాపు రిలీజైన అన్ని మేజర్ ఏరియాల్లో డబ్బై శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. ఈవినింగ్ షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. హైదరాబాద్ లోని మెజారిటీ మల్టిప్లెక్స్ లు స్లో పుల్స్ అయ్యాయి. అంతేకాదు పాపులర్ సింగిల్ స్క్రీన్స్ సైతం హైదరాబాద్ లో ఫుల్స్ అవటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ తర్వాత ..సోమవారం హౌస్  ఫుల్ అయిన సినిమా ఇదే కావటం చెప్పుకోదగ్గ విషయం.కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చిన చిత్రంగా నిలిచింది ‘అఖండ’. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ ఇదే హవా కొనసాగిస్తోంది.  
 
 ఇక ఓవర్ సీస్ విషయానికి వస్తే... కొవిడ్‌ సెకండ్‌ తర్వాత ఓవర్సీస్‌లో (విడుదలైన తొలిరోజు) అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియన్‌ కరెన్సీ ప్రకారం.. ఈ సినిమా కెనడాలో (ప్రీమియర్‌తో కలిపి) సుమారు రూ. 13లక్షలు, యుకేలో సుమారు రూ. 32 లక్షలు, ఆస్ట్రేలియాలో సుమారు రూ. 52 లక్షలు రాబట్టిందని పేర్కొన్నారు. అమెరికాలో (మూడు రోజులు కలిపి) సుమారు రూ.5 కోట్లు కలెక్ట్‌ చేసిందని ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది.

also read: Unstoppable With NBK: ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై హాట్ కామెంట్స్.. బోయపాటి ముందే బాలయ్య కంటతడి
 

Follow Us:
Download App:
  • android
  • ios