పవన్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా?

about pawan kalyan film with koratala siva
Highlights

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా తరువాత పవన్ రాజకీయాల పరంగా బిజీ అయిపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో సినిమా చేయాలనుకున్నాడు.. అడ్వాన్స్ కూడా అందుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్త రవితేజ దగ్గరకి వెళ్లింది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ మిస్ అయ్యాడని సమాచారం.

వరుసగా నాలుగు హిట్ సినిమాలు అందుకున్న దర్శకుడు కొరటాల శివకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉండేదట. ఆయన కోసం కథ కూడా రాసుకున్నాడని సమాచారం. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఇప్పుడు ఆ కథను పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి అనుగుణంగా మార్చే పనిలో పడ్డట్లు టాక్. 'భరత్ అనే నేను' చిత్రంతో ఘన విజయం అందుకున్న కొరటాల తన తదుపరి సినిమా మరో స్టార్ హీరోతో చేస్తాడనుకున్నారు.

కానీ ప్రస్తుతం హీరోలందరూ బిజీగా ఉండడంతో తన ఆలోచన మార్చుకొని చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. వీరిద్దరి మధ్య సీక్రెట్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయట. ప్రస్తుతం చిరంజీవికి కూడా మార్కెట్ లో క్రేజ్ బాగుంది. అందుకే చిరుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. 

loader