గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠి కెరీర్ అంతంత మాత్రంగా ఉంది.  భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్స్  అందుకున్నా  లావణ్య త్రిపాఠికి ఆ త‌ర్వాత ప్లాఫ్ లు వచ్చేసి లెవిల్ చేసేసాయి. దాంతో ఆమె ట్రాక్ రికార్డ్ ..రెమ్యునేషన్ పరంగా  ఇబ్బందిగానే మారింది. ఆఫర్ వస్తే చాలు ..డబ్బులు మాట దేవుడెరుగు అనే సిట్యువేషన్ ఒకానొక సిట్యువేషన్ లో వచ్చేసింది.

దాంతో  70-80 లక్షలు వరకూ డిమాండ్ చేసి మరీ రెమ్యునేషన్ తీసుకునే ఆమె సైలెంట్ గా ఇచ్చింది బ్యాంక్ లో వేసుకునే సిట్యువేషన్ కు చేరుకుంది.  ప్ర‌స్తుతం లావణ్య న‌టించిన అంత‌రిక్షం 9000కెఎంపిహెచ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేఫధ్యంలో అంతరిక్షం సినిమాకి లావ‌ణ్య ఎంత రెమ్యునేషన్  అందుకుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. 40  ల‌క్ష‌ల దాకా రెమ్యునేషన్ తీసుకుందని తెలుస్తోంది. మొదట ఎనభై అని చెప్పినా..ఆ తర్వాత కథ నచ్చింది, నేను చేస్తాను అని కబురు పెట్టి మరీ నలబైకు ఒప్పుకుని కమిటైందని చెప్తున్నారు. డబ్బులు అవసరం ఆమెను సగానికి సగం దిగి వచ్చేలా చేసిందన్నమాట.  ఈ సినిమా హిట్ అయితే తను అనుకున్న రేటు డిమాండ్ చేయచ్చు కదా అని ఎదురుచూస్తోందిట లావణ్య. 

వరుణ్‌తేజ్‌, అదితీరావ్‌ హైదరీ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘అంతరిక్షం: 9000 kmph’. సంకల్ప్‌రెడ్డి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది ఇందులో వరుణ్‌తేజ్‌ వ్యోమగామిగా కనిపించనున్నారు. జలంతర్గామి నేపథ్యంలో ‘ఘాజీ’ని తెరకెక్కించిన సంకల్ప్‌రెడ్డి ఈ సారి అంతరిక్షం, స్పేస్‌ సెంటర్‌ నేపథ్యంలో ఈ కథను తీర్చిదిద్దడం విశేషం.

ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వై.రాజివ్‌రెడ్డి, కె.సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. డిసెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.