టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ గతేడాది 'అరవింద సమేత' సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మే నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.

త్రివిక్రమ్ తన సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ ని బాగా చూపిస్తుంటారు. 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అ ఆ', 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత' వంటి సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. బన్నీతో త్రివిక్రమ్ చేయబోయే సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో కూడిన కథ అని సమాచారం.

ఎప్పుడైతే ఈ విషయం బయటకి వచ్చిందో.. అందరూ 'సన్నాఫ్ సత్యమూర్తి'కి సీక్వెల్ అనుకున్నారు కానీ ఇది కొత్త కథ అని తెలుస్తోంది. అయితే ఫాదర్ సెంటిమెంట్ మాత్రం పక్కా ఉంటుంది. ఈ సినిమాకి టైటిల్ గా కొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు.

అందులో 'నాన్న.. నేను' అనే టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. మరో హీరోయిన్ పాత్రలో కేథరిన్ త్రెసా కనిపించనుందని టాక్. ఈ విషయాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే 
రానుంది.