శ్రీదేవి హత్యలో దావూద్ హ్యాండ్?

First Published 23, May 2018, 12:42 PM IST
about actress sridevi death mystery
Highlights

నటి శ్రీదేవి మరణం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఆమె సహజంగానే మరణించారా..?

నటి శ్రీదేవి మరణం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఆమె సహజంగానే మరణించారా..? లేక ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి చంపారా..? శ్రీదేవి మరణం విషయంలో సుప్రీం కోర్టు సమగ్ర విచారణ జరపాలని నిర్మాత సునీల్ సింగ్ వేసిన పిటిషన్ ను కోర్టు ఎందుకు కొట్టేసింది..? ఆయన వేసిన పిటిషన్ లో కొన్ని అంశాలు సంచలనంగా మారాయి. సునీల్ సింగ్ పిటీషన్ ప్రకారం శ్రీదేవి తన పేరు మీద రూ.240 కోట్లకు ఇన్సూరన్స్ పాలసీ చేయించారు.

అది కూడా ఒమన్ లో కాబట్టి దుబాయ్ లో ఉండగానే ఆమె మరణిస్తే ఆ డబ్బు తన కుటుంబానికి దక్కుతుందని అదొక నిబంధన అని ఆయన అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ఏ ఇన్సూరన్స్ కంపెనీ కూడా ఇలాంటి రూల్స్ పెట్టదని చెబుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా సంతోషంగా ఉండే శ్రీదేవి సడెన్ గా బాత్ టబ్ లో ఎలా మరణిస్తుందనేది ప్రతి ఒక్కరిలో అనుమానాలను కలిగిస్తోంది.

రీసెంట్ గా శ్రీదేవి మరణంపై పెర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేసిన రిటైర్డ్ ఏసీపీ అరివేద్ భూషణ్ మాత్రం శ్రీదేవి మరణంలో ముంబై డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉండొచ్చని అంటున్నారు. పోలీసులు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ నమ్మే విధంగా లేదని.. ప్లాన్ ప్రకారమే ఆమెను చంపేసి ఉంటారని వేద్ భూషణ్ అంటున్నారు. శ్రీదేవి మరణించిన జుమైరా టవర్స్ దావూద్ కు సంబంధించినది కావడంతో ఈ వార్తలకుమరింత బలం చేకూరుతుంది.

ఇస్లామిక్ దేశాల్లో దావూద్ ప్రభావితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన చట్టాన్ని, పోలీసుల్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందని ఆరోపిస్తున్నారు. శ్రీదేవికి బ్లడ్ టెస్ట్ చేయాలని దరఖాస్తూ చేసుకున్నా కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి మిగిలిన వివరాలు ఇవ్వడానికి దుబాయ్ పోలీసులు ఎందుకు నిరాకరించారని వేద్ భూషణ్ అంటున్నారు.   

loader