బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. శనివారం మధ్యాహ్నం తనకు  కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చిందంటూ అభిమానులకు తెలిజేశాడు అభిషేక్‌. గత నెలలో అమితాబ్‌ బచ్చన్ సహా ఆయన కుటుంబంలోని అభిషేక్‌, ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఐశ్యర్య, ఆరాధ్యలు ముందుగానే కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, ఇటీవలే అమితాబ్‌ కూడా పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లిపోయారు.

అయితే అభిషేక్‌ మాత్రం తనకున్న ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కోలుకోవడానికి ఆలస్యమవుతుందని తెలిపాడు. తాజాగా ఆయన కూడా పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశాడు చోటా బీ. `మాటంటే మాటే.. ఈ మధ్యాహ్నం నాకు కోవిడ్ 19 టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చింది. నేను మీకు ముందే చెప్పాను ఈ పరిస్థితిని జయిస్తానని. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా నానావతి ఆసుపత్రి డాక్టర్లు, నర్సులకు నా ప్రత్యేక ధన్యవాదాలు` అంటూ ట్వీట్ చేశాడు.