బాలీవుడ్ హీరో.. అమితాబ్ తనయుడు, ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ పై నెటిజన్లు కౌంటర్లు పేల్చుతున్నారు. ఐశ్వర్య రాయ్ సినిమాలను సాకుగా చూపిస్తూ.. అభిషేక్ ను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.
రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ అయ్యింది. ఈమూవీలో అందరు స్టార్లతో పాటు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కూడా అద్భుతంగా నటించింది. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. నమణిరత్నం డైరెక్ట్ చేసిన ఈసినిమా ఈనెల 28న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
తమిళనాట మాత్రమే దూసుకుపోతున్న ఈ హిస్టారికల్ డ్రామా మూవీకిలో ఐశ్వర్యరాయ్ తో పాటు చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా ధూళిపాళ మరియు ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్స్ నటించారు. ఇంత మంది తారలు ఒక సినిమాలో కనిపించడంతో.. అభిమానులు ఈ సినిమాను చూడటాన్ని థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఇక ఈసినిమాలో నందిని పాత్రలో కనిపించిన ఐశ్వర్యరాయ్ పై .. ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈక్రమంలో ఈసినిమా చూసిన ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఐశ్వర్య నటను తెగ పొగిడారు.
ఈ సినిమా టీమ్ తో కలిసి స్పెషల్ గా షో చూసిన అభిషేక్ బచ్చన్.. PS2 సినిమా అద్భుతం అన్నారు. ఐశ్వర్య నటనను, అందాన్ని పొగుడుతూ ట్వీట్ చేశారు. అంతే కాదు విక్రమ్, త్రిష,జయం రవి తో పాటు తన ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసి ఫోటోను పోస్ట్ చేశాడు అభిషేక్. ఐశ్వర్య రాయ్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలలో బెస్ట్ అంటూ.. ఆకాశానికి ఎత్తాడు అభిషేక్. ఐశ్వర్య రాయ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది అన్నారు అభిషేక్. అంతే కాదు ఈమూవీ టీమ్ అందరికి అభినందనలు తెలియజేశారు.
ఇక అభిషేక్ ట్వీట్ కు నెటిజన్లురకరకాలుగా స్పందిస్తున్నారు. ఈక్రమంలో ఆయనకు కౌంటర్లు వేస్తూ.. ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ ఇలానే సినిమాలు చేస్తుంటుంది.. ఇలానే ఇంకా సినిమాలకు ఇలానే సైన్ చేయనీవ్వండి సారు.. మీరు ఇంట్లో ఉండి.. ఆరాధ్యను బాగా చూసుకోండి అంటూ.. వ్యాంగ్యంగా కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఐశ్వర్యను సినిమాలు చేయనివ్వాలి అన్నట్టుగా కామెంట్స్ పెట్టారు. ఇక సినిమాలు లేకపోవడంతో అభిషేక్ బచ్చన్ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అడపదడపా సినిమాలు తప్పించి.. ఆయన పెద్దగా సినిమాలు చేసింది లేదు.
దాంతో ఇంట్లోనే ఉంటూ.. ఆరాధ్యను చూసుకో అన్నట్టుగా నెటిజన్లు వేస్తున్న కౌంటర్లు.. సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఈ వైరల్ ట్వీట్లకుఅభిషేక్ బచ్చన్ కూడా జబాబు ఇచ్చారు. ఆమెను సంతకం అయితే చేయనీయ్యండి సార్.. ఐశ్వర్యకు ఏదైనా చేయాలి అనపిస్తే.. దానికి నా అనుమతి అస్సలు అవసరం లేదు. ముఖ్యంగా తాను ఏదైతే ప్రేమిస్తుందో .. అది ఫ్రీగా చేసుకుంటుంది అంటూ రీప్లై కౌంటర్ ఇచ్చారు అభిషేక్. ఇక ఈ ట్విట్టర్ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
