అభిరామ్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు!

abhiram daggubati lost his phone gets blackmailed
Highlights

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు అభిరామ్ పై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు అభిరామ్ పై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలు మాత్రమే కాదు వారిద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను సైతం రివీల్ చేసింది. ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొందరు దుండగులు అభిరామ్ ఫోన్ ను తస్కరించడానికి ప్లాన్ చేశారు. ఆ ఫోన్ లో డేటాను బట్టి అభిరామ్ దగ్గర నుండి డబ్బు గుంజాలని అనుకున్నారు. అనుకున్నట్లుగా గత నెల అభిరామ్ ఓ రెస్టారంట్ లో ఉండగా, అతడి ఐఫోన్ ను దొంగిలించారు.

ఫోన్ పాస్ వర్డ్ ను హ్యాక్ చేసి అందులో ఉన్న కొన్ని ఫోటోలను, వీడియోలను చూశారు. వాటిని బయటపెడతామని అభిరామ్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ప్రత్యేకంగా ఓ ఈమెయిల్ ఐడీని క్రియేట్ చ్సుకొని దాని నుండి గత నెల 24న అభిరామ్ కు మెయిల్ పంపారు. ఆ మెయిల్ లో ఫోటోలు, వీడియోల విషయాన్ని ప్రస్తావిస్తూ 1.5 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేశారు.

ఒకవేళ డబ్బు గనుక ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో సురేష్ బాబు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు నలుగురుని బాధ్యులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరికి చెందిన ఈ నిందితులు హైదరాబాద్ లోనే నివాముంటున్నారు. అయితే ఆ ఫోన్ లో ఎలాంటి వీడియోలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 

loader