Asianet News TeluguAsianet News Telugu

‘అభినేత్రి 2’ రివ్యూ

 తెలుగు సినిమాని పట్టిన దెయ్యాలు వదిలాయి కానీ తమిళ సినిమాని మాత్రం ఇప్పుడిప్పుడే వదిలేటట్లు కనపడటం లేదు. కాంచన హిట్ ప్రభావమో లేక వేరకొటో కానీ దెయ్యం సినిమాల్లో పేరున్న స్టార్స్ సైతం రెచ్చిపోయి నటిస్తున్నారు. అయితే ఆ దెయ్యాలు ఫెరఫార్మెన్స్ బాగుంటే ఏ ఇబ్బందీ లేదు. పాత కాలం రొటీన్ దెయ్యాలు..తమ పాచిపట్టిన ఫ్లాష్ బ్యాక్ లతో ప్రేక్షకులను పరవసింప చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రతీవారం దెయ్యాలతో ధియోటర్స్ నిండుతున్నాయి. కానీ ఆ దెయ్యాలు ఉన్న ధియోటర్స్ వైపు జనమే భయపడి పోవటం లేదు. ఇదిగో ఈ వారం కూడా అభినేత్రి 2 అంటూ ఓ దెయ్యాల చిత్రం వచ్చింది.  ప్రభుదేవా, తమన్నా వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది. ఇది రొటీన్ దెయ్యాల చిత్రమా లేక ఏదన్నా వెరైటీ పాయింట్ ఉందా..అనేది చూద్దాం.
 

Abhinetri -2 movie telugu review
Author
Hyderabad, First Published Jun 1, 2019, 5:35 PM IST

---సూర్య ప్రకాష్ జోశ్యుల
 

కథేంటి
అభినేత్రి ఫస్ట్ పార్ట్ లో రూబి దెయ్యం దెబ్బకు ఇబ్బంది పడ్డ కృష్ణ (ప్రభుదేవా)  ఆ ఇల్లు వదిలేసి ప్రమోషన్ మీద మారిషష్ వెళ్లిపోతాడు. కొద్ది రోజులు అక్కడే దేవి (తమన్నా)తో అక్కడే బాగానే గడుస్తాయి. కానీ ఈ లోగా కృష్ణ ..దేవిని కాకుండా మరో ఇద్దరు అమ్మాయిలు  సారా(నందిత శ్వేతా)ఈశా(డింపుల్ హయాత్)  వెనకపడటం మొదలెడతారు. ప్రేమించని వెంటబిస్తూంటాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. ఈ విషయాలేమి కృష్ణకు తెలియదు.  ఈ రోమియో వేషాలు చూసి కంగారుపడిన దేవి ..అక్కడ లోకల్ గా పరిచయం అయిన లేడీ లాయర్(కోవై సరళ)సాయం కోరుతుంది. 

కొన్ని సంఘటనల తర్వాత  అసలు నిజం బయిటపడుతుంది. నిజానికి అలా ప్రవర్తిస్తోంది కృష్ణ కాదని అతని శరీరంలో ఉన్న అలెక్స్-రంగారెడ్డి అనే రెండు దెయ్యాలని రివీల్ అవుతుంది. లాయిర్ సలహాతో  దేవి ఆ దెయ్యలతో ఒక అగ్రీమెంట్ కుదుర్చుకుంటుంది.  అప్పుడు మరో విషయం బయిటపడుతుంది.  అలెక్స్ రంగారెడ్డిలకు రుద్ర(అజ్మల్ అమీర్)కు ఉన్న కనెక్షన్ తెలుస్తుంది. అసలు రెండు ఆత్మలు కృష్ణనే ఎందుకు పట్టుకున్నాయి.  దేవి తన భర్తను ఎలా కాపాడుకుంది చివరికి ఈ జంట కథ ఎక్కడికి చేరుకుంది ...ఆ దెయ్యాల కోరికలు తీరాయా ? లేదా ? వాటి కోసం దేవి ఏమి చేసింది ?లాంటి విషయాలు తెలియాలంటే  సినిమా  చూడాల్సిందే.

ఎలా ఉంది..

ఈ సినిమాకు ప్రభుదేవా డాన్స్, తమన్నా నడుము తప్ప పెద్దగా ఎట్రాక్టివ్ ఎలిమెంట్స్ లేవు. కథ చూస్తే..ఈ సినిమాలో నావెల్టీ పాయింట్ ఏదన్నా ఉందా అంటే అది రెండు దెయ్యాలు ఒకడ్నే పట్టుకోవటం. దాంతో హీరో ప్రభువేదా అపరిచితుడులా బిహేవ్ చేస్తూంటాడు. తనకు తెలియకుండా తనలో ఉంటే దెయ్యాలు చెప్పినట్లు వింటూంటాండు. ఇదంతా వినటానికి బాగానే ఉంది. కానీ తెరమీదకు ఎక్కేసరికి పెద్దగా ఎక్సైట్మెంట్ లేదు. మరీ ముఖ్యంగా ఈ పాయింట్ కు సంభందించి బేస్ గా నిలిచే ఫ్లాష్ బ్యాక్ లలో బలం లేకపోవటం, అవి మరీ సిల్లీగా, ప్యారడీలుగా ఉండటం తో సినిమా తేలిపోయింది. స్టోరీ లైన్ లోంచి కామెడీ పుట్టాలి కానీ ..స్టోరీ లైన్ నే కామెడీ చేస్తే ఇలాగే డల్ గా ఉంటుంది. స్టోరీలైన్ స్ట్రాంగ్ గా ఉండి ఉంటే ఆ సీన్స్ నమ్మదగినవిగా ఉండేవి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమాని ఆ చిన్న సన్నని లైన్ మీద నడపాలి అని, వేరే ట్విస్ట్ లు టర్న్ లు చూసుకోకపోవటం దెబ్బకొట్టింది. దాంతో రెండు దెయ్యాలు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. 

టెక్నికల్  గా
నటీనటుల్లో ప్రభుదేవా చాలా ఈజ్ తో చేసారు. తమన్నా ..నటనకన్నా గ్లామర్ మీదే ఆధారపడింది. కోవై సరళ..కాంచన డోస్ ని రెట్టింపు చేసేసింది. అరవ అతిని మరింత అతిగా పరాకాష్టకు తీసుకెళ్లింది. సోనూ సూద్ సోసో.  సప్తగిరి పెద్దగా ఉపయోగపడలేదు.

ఇక  దర్శకుడుగా ఎఎల్ విజయ్...ఈ సినిమాని బాగా లైట్ తీసుకుని డబ్బులు కోసం చేసినట్లు గా తీసారు. ఎక్కడా సీరియస్ నెస్ అనేది లేదు. సామ్ సిఎస్ సంగీతం ఒక్క పాట కూడా బాగో లేదు. ఇలాంటి సినిమాలకు ప్లస్ అవ్వాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే.  అంటోనీ ఎడిటింగ్ ..ఫస్టాఫ్ ని బాగానే చేసినా,సెకండాఫ్ దగ్గరకు వచ్చేసరికి చేతులెత్తేసారు.   బోస్ ఛాయాగ్రహణం బాగుంది.  ఉన్నంతలో  రిచ్ గా చూపించే ప్రయత్నం చేసాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే...రూపాయి ఖర్చు పెట్టకుండా సీక్వెల్ ని క్యాష్ చేసుకుందామనే ప్రయత్నం కనపడుతుంది.   

ఫైనల్ థాట్
ఆత్మల సినిమాలో కథాత్మ మిస్సైంది

రేటింగ్: 2/5
-------------
 ఎవరెవరు
నటీనటులు: ప్రభుదేవా - తమన్నా - నందిత శ్వేతా - డింపుల్ హయాతి - కోవై సరళ - సప్తగిరి - సోను సూద్ - అజ్మల్ అమీర్ తదితరులు
సంగీతం : సామ్ సిఎస్
ఛాయాగ్రహణం : ఆయనంక బోస్
ఎడిటింగ్ : అంటోనీ
నిర్మాతలు : అభిషేక్ నామా - ట్రైడెంట్ రవిచంద్రన్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఎఎల్ విజయ్

Follow Us:
Download App:
  • android
  • ios